ఏపీలో సైకో జగన్ పాలన పోవాలి …….సైకిల్ రావాలని వ్యాఖ్యానించారు టీపీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నిన్న రాత్రి విజయనగరం జిల్లా రాజాం లో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించగా చంద్రబాబు హాజరయ్యారు. జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. ఒక్క చాన్స్ ……ఒక్క అవకాశం అంటే జగన్ ను నమ్మొద్దని ఎంతగానో మొత్తుకున్నా…… కానీ మీరు వినలేదు. ఒక్కసారి అని సైకో జగన్ కు ఛాన్స్ ఇచ్చారు. అతడు వస్తే పోలవరం ఆగిపోతుందని చెప్పాను అదే జరిగిందన్నారు చంద్రబాబు.
45 ఏళ్లుగా రాజకీయాలలో ఉన్నాను . ఇలాంటి సైకో ను , రాక్షసుడిని ఇంతవరకు చూడలేదు. మీకు 10 రూపాయలు ఇస్తున్నాడు 100 రూపాయలు లాక్కుంటున్నాడు. వచ్చే ఎన్నికల్లో 5 వేలు ఇచ్చినా 10 వేలు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం సైకిల్ కె వేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల కోసం ఎన్టీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని , ఆ తర్వాత ఆయన ఆశయాలు కొనసాగిస్తోంది నేనే నన్నారు. ఖమ్మం లో సభ పెడితే నాయకులు ఎవరూ లేకపోయినప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని అందుకు నిదర్శనం నేను సాగించిన పాలనే అని అన్నారు చంద్రబాబు.