35.2 C
India
Wednesday, May 22, 2024
More

    హైకోర్టులో ఎంపీ అవినాశ్‌రెడ్డికి గట్టి షాక్..

    Date:

    YS Avinash Reddy will arrest in YS Vivekananda murder case 
    YS Avinash Reddy

    తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిముందస్తు బెయిల్‌పై వరుసగా రెండోరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఇప్పటికిప్పుడు తీర్పు ఇవ్వడం కుదరదని.. జూన్-05కు హైకోర్టు విచారణ వాయిదా వేసింది. అయితే.. అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించాలని అటు అవినాష్ రెడ్డి.. ఇటు వైఎస్ సునీతారెడ్డి లాయర్లకు హైకోర్టు సూచించింది. దీంతో అవినాష్ తరఫు న్యాయవాది సీజేని ఆశ్రయించారు. హైకోర్టు తీర్పునిచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఎంపీ అవినాష్ రెడ్డికి సీజే బెంచ్‌లోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ తెలిపారు. వెకేషన్ బెంచ్‌ ముందు మెన్షన్ చేసుకోవాలని సీజే స్పష్టం చేశారు. అసలు ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని సీజే చెప్పడంతో అవినాష్‌కు గట్టి షాక్ తగిలినట్లయ్యింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు సీజేఐ కామెంట్స్ చేశాక ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు..? అని తెలంగాణ హైకోర్టు సీజే ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు.

    ఇవాళ మధ్యాహ్నం3:30 గంటల నుంచి అటు అవినాష్ రెడ్డి.. ఇటు వైఎస్ సునీతారెడ్డి లాయర్లు తమ వాదనలు న్యాయస్థానానికి వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ముందస్తు బెయిల్‌పై ఇవాళ వాదనలు వినిపించినా తీర్పు ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. రేపట్నుంచీ హైకోర్టుకు సెలవులు కావడంతో వెకేషన్ తర్వాతే తీర్పు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. దీంతో జూన్-05కు విచారణ వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అయితే ఈ కేసులో అర్జెన్సీ ఉందని ఇరుపక్షాల లాయర్లు కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్‌పై తీర్పు అన్ని రోజులు రిజర్వ్‌లో పెట్టడం బాగుండదని.. అత్యవసరమైతే చీఫ్ కోర్టును అభ్యర్థించాలని హైకోర్టు సూచించింది. అంతేకాదు.. కేసును వెకేషన్‌ బెంచ్‌కు మార్చుకోవచ్చని హైకోర్టు ఇరు పక్షాలకు సూచించింది. సీజే ఎదుట మెన్షన్ చేసి ఆర్జెన్సీ ఉందని చెబితే.. ఆయన నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు తెలిపింది. దీంతో హైకోర్టులో అవినాష్‌కు గట్టి షాక్ తగిలినట్లయ్యింది.

    మొత్తానికి చూస్తే.. హైకోర్టు, సీజే బెంచ్‌లో ముందస్తు బెయిల్‌పై ఊరట లభించకపోవడంతో అవినాష్‌రెడ్డికి తిప్పలు తప్పేలా లేవని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఇక సీబీఐ మరింత దూకుడు పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు.. సీబీఐ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరో రెండు మూడ్రోజుల్లో ఈ కేసులో కీలక పరిణామాలు ఉండే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Avinash Reddy : కడపలో అవినాష్ రెడ్డికి ఓటమి తప్పదా..?

    Avinash Reddy : ఎన్నికల ప్రచార హడావుడి కొన్ని గంటల్లో ముగియనుంది....

    Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట

    ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయింపు జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట...

    High Court: వ్యూహం సినిమా విడుదలపై..నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

      వ్యూహం’ సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు ...