36.9 C
India
Sunday, May 19, 2024
More

    తెలంగాణలో కర్ణాటక మోడల్.. బీజేపీ ప్లాన్ ఫలిస్తుందా?

    Date:

    bjp karnataka
    bjp karnataka

    ద‌క్షిణాదిలో క‌ర్నాట‌క త‌ర్వాత బీజేపీకి కొద్దొ గొప్పో ఆశ‌లున్న‌వి తెలంగాణ‌పైనే. ఇక్క‌డ పాగా వేయ‌డం ద్వారా మున్ముందు సౌత్‌లోని మిగ‌తా రాష్ట్రాలైన ఏపీ,త‌మిళ‌నాడు,కేర‌ళ‌ల‌లో విస్త‌రించేందుకు మార్గం సుగ‌మం అవుతుంద‌ని ఆపార్టీ అంచ‌నా వేస్తోంది. అయితే తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చేందుకు ఎలాంటి విధానాల‌తో ముందుకెళ్లాల‌నే విష‌యంపై ఢిల్లీ బీజేపీ పెద్దలు చాలా సీరియ‌స్ డిస్క‌ష‌న్స్ జ‌రిపిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర నేత‌ల‌తో ఈ అంశంపై సుదీర్ఘంగా మంత‌నాలు కూడా జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది.

    అయితే రాష్ట్రంలో రాబోయే ఎన్నిక‌ల‌ను ఎదుర్కోనేందుకు హిందు ఎజెండాను సీరియ‌స్‌గా ముందుకు తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు అనిపిస్తోంది. ఇందుకోసం క‌ర్నాట‌క మోడ‌ల్‌ను తెలంగాణ‌లోనూ అమ‌లు చేయాల‌నే కాషాయ నేత‌లు భావిస్తున్నారు. క‌ర్నాట‌క‌లో ఈసారి ఒక్క ముస్లిం అభ్య‌ర్థికి కూడా బీ-ఫాం ఇవ్వ‌లేదు. ఆ పార్టీలో చాలా మంది ముస్లిం సీనియ‌ర్ నేత‌లున్నారు. అయిన‌ప్ప‌టికి వారికి భాజ‌పా టికెట్లు ద‌క్క‌లేదు.

    అంతేకాక ముస్లింల‌కు కాంగ్రెస్ ప‌వ‌ర్‌లో ఉన్న‌ప్పుడు కేటాయించిన నాలుగు శాతం ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేశారు. ఆ 4 శాతం రిజ‌ర్వేష‌న్ కోటాను సీఎం బ‌స‌వ‌రాజ బొమ్మై స‌ర్కార్ ఒక‌లిగ‌ల‌కు 2 శాతం,లింగాయ‌తుల‌కు 2 శాతం స‌ర్దుబాటు చేసింది. దీంతో పాటు క‌ర్నాట‌క బీజేపీలో సీనియ‌ర్ నేత, మాజీ సీఎం జ‌గ‌దీశ్‌కు ఈసారి బీ-ఫాం ద‌క్క‌లేదు. మొత్తంగా ఒక‌వైపు ముస్లిం వ‌ర్గాల‌ను దూరం పెడుతూనే హిందు ఓటు బ్యాంకు కోసం బీజేపీ నేత‌లు ప‌క్క‌గా స్కెచ్ గీసుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అంతేకాక సీనియ ర్లను దూరం పెట్ట‌డం ద్వారా యువ‌కుల‌కు టికెట్లు ఇచ్చి యువ‌త ఓట్లను కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేసింది.

    ఇక ప్ర‌స్తుతం తెలంగాణ‌లోనూ ఇదే విధానాల‌ను అవ‌లంభించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఇక్క‌డ మొన్న చేవెళ్ల‌లో జ‌రిగిన స‌భ‌లో అమిత్ షా తాము అధికారంలోకి వ‌స్తే ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. వాటిని బీసీ,ఎస్సీ,ఎస్టీల‌కు స‌ర్దుబాటు చేస్తామ‌న్నారు. దీంతో ఇక్క‌డ కూడా రాబోయే రోజుల్లో క‌ర్నాట‌క మోడ‌ల్‌నే బీజేపీ అనుస‌రించ‌బోతుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

    అంతేకాక ఇక్క‌డ కూడా ఇప్ప‌టికే తెలంగాణ బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌ను పార్టీకి దూరంగా ఉంచుతున్నారు. డా.ల‌క్ష్మ‌ణ్ కు రాజ్య‌స‌భ సీటు కేటాయించ‌డం ద్వారా మెల్ల‌గా ఆయ‌న‌ను తెలంగాణ పాలిటిక్స్ నుంచి త‌ప్పించారు. న‌ల్లు ఇంద్రారెడ్డి, విద్యాసాగ‌ర్ వంటి నాయ‌కులు ఊసులో కూడా లేరు. మొత్తంగా క‌ర్నాట‌క మోడ‌ల్ ను స‌రిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే త‌ప్ప‌కుండా తెలంగాణ‌లో స‌క్సెస్ కావ‌డం ఖాయ‌మ‌నే నిర్ణ‌యానికి ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు వ‌చ్చిన‌ట్లు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.  అయితే వారు అంచ‌నాలు ఏ మేర‌కు ఫ‌లిస్తాయ‌నేది మున్ముందు చూస్తేనే కానీ,చెప్ప‌లేమంటున్న రాజ‌కీయ విశ్లేష‌కులు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...