తెలంగాణ లో ఒక్క ఏడాదిలోనే మద్యం బాబులు 30 వేల కోట్ల మద్యాన్ని తాగారు. ఇది ఇప్పటి వరకు లెక్క మాత్రమే సుమా ! ఏడాది పూర్తి కావడానికి మరో 5 రోజుల సమయం ఉంది పైగా న్యూ ఇయర్ వేడుకలు కూడా జరుగనున్నాయి. దాంతో మరికొంత డబ్బు తెలంగాణ ఖజానాలో చేరడం ఖాయం.
తెలంగాణ ఏర్పడిన నాటికి 10 వేల కోట్ల మద్యం కూడా తాగలేదు. కానీ ఈ ఎనిమిదిన్నర సంవత్సరాలలో రెండున్నర రెట్లు పెరిగింది….. మద్యం వల్ల తెలంగాణ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇక ఈ ఏడాదిలో ఏకంగా 30 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మందుబాబులు రెచ్చిపోయి ఒళ్ళు గుల్ల చేసుకొని మరీ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నారు. దాంతో రాష్ట్ర ఖజానా కాసులతో నిండిపోతోంది.