ఈరోజు సతీసమేతంగా ఢిల్లీ వెళ్లనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నాలుగు రోజుల పాటు ఢిల్లీ లోనే ఉండనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చడంతో రేపు , అలాగే ఎల్లుండి రెండు రోజుల పాటు రాజసూయ యాగం చేయనున్నారు. ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి కార్యాలయంలో ఈ యాగం నిర్వహించనున్నారు కేసీఆర్. యాగంలో కేసీఆర్ సతీమణి కూడా పాల్గొననుంది.
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. యాగం అయ్యాక BRS జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించనున్నారట. మరో నాలుగైదు నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు రాబోతున్నందున అక్కడ కుమారస్వామితో కలిసి BRS పోటీ చేయనుంది. కుమారస్వామితో పాటుగా నటుడు ప్రకాష్ రాజ్ కు కర్ణాటక బాధ్యతలు అప్పగించనున్నారట కేసీఆర్.