ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈరోజు డిసెంబర్ 27 న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే నేను కోర్టులో పిటీషన్ వేసినందున ఈరోజు ఈడీ విచారణకు హాజరు కాబోవడం లేదని మెయిల్ చేసాడు. రేపు రోహిత్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణకు వస్తుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంతకుముందే రెండు రోజుల పాటు రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది. అలాగే డిసెంబర్ 27 న మరోసారి రావాలని కోరింది.
కానీ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదు దారుడిని అయిన నన్ను కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేసాడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇక ఈరోజు విచారణకు డుమ్మా కొట్టడంతో ఈడీ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని సిట్ నుండి తప్పిస్తూ సీబీఐ కి తెలంగాణ హైకోర్టు అప్పగించిన విషయం తెలిసిందే.