
హైదరాబాద్ ఐటీ కేంద్రానికి అడ్డా అయిన విప్రో సర్కిల్ లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. టిప్పర్ సృష్టించిన బీభత్సం లో స్విగ్గీ డెలివరీ బాయ్ నజీర్ మృతి చెందగా నాలుగు కార్లు , 3 బైక్ లు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటన నిన్న అర్ధరాత్రి ( డిసెంబర్ 25 , ఆదివారం రోజున ) జరిగింది. అర్ధరాత్రి పూట టిప్పర్ లారీలు అతి వేగంగా వెళ్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం పరిధిలో పలు యాక్సిడెంట్ లు జరిగాయి. దాంతో ట్రాఫిక్ పోలీసులు, అలాగే పోలీసు విభాగం కూడా పలు చర్యలు చేపట్టింది. కానీ ఎన్ని చర్యలు చేపట్టినా యాక్సిడెంట్ లను మాత్రం నివారించలేక పోతున్నారు.