37 C
India
Friday, May 17, 2024
More

    Rajpal Singh: గతంలో టీమిండియా కేప్టన్.. ఇప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్.. విధి అంటే ఇదే కదా..

    Date:

    Rajpal Singh: 2010లో భారత్ కామన్ వెల్త్ గేమ్స్ కు ఆతిథ్యం ఇచ్చింది. ఢిల్లీ వేధికగా జరిగిన క్రీడల్లో ఇండియా అదిరిపోయే ప్రదర్శన కనబరిచి 101 పతకాలు దక్కించుకొని రెండో స్థానంలో నిలిచింది. ఇందులో బంగారు పతకాలు 38, వెండి 27, కాంస్య పతకాలు 36 ఉన్నాయి. ఇందులో పురుషుల హాకీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆసాంతం అలరించిన గేమ్ బంగారు పతకాన్ని తెచ్చిపెట్టింది. ఈ మ్యాచ్ కి కేప్టన్ గా రాజ్‌పాల్ సింగ్ ఉన్నారు. మ్యాచ్ గెలవడంలో ఆయన పాత్ర కీలకంగా మారింది. ఫైనల్ మ్యాచ్ లో దాయాది దేశమైన పాకిస్తాన్ తో తలపడి బంగారు పతకాన్ని సాధించుకుంది భారత్.

    అయితే ఇండియాకు బంగారు పతకం తెచ్చిపెట్టిన రాజ్‌పాల్ సింగ్ ప్రస్తుతం ఐపీఎల్ గేమ్స్ కు సెక్యూరిటీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మెయిన్ గేట్ వద్ద తన అనుచరులతో పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఐపీఎలే కాకుండా అంతర్జాతీయ మ్యాచ్ లకు కూడా ఆయన సెక్యూరిటీ బాధ్యతలు తీసుకున్నారు.

    అసలేం జరిగిందంటే ఇంటర్ నేషనల్ గేమ్స్ లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లకు రిటైర్ మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాజ్ పాల్ సింగ్ కు డీఎస్పీ ఉద్యోగం వచ్చింది. ఆటలో చూపిన శ్రద్ధ ఉద్యోగంలో కూడా చూపుతానని రాజ్ పాల్ సింగ్ చెప్తున్నాడు. టీమిండియా, ఇంటర్ నేషనల్ క్రికెటర్స్ ను ఇక్కడ కలుస్తుంటానని ఇది నాకు ఎంతో ఆనందంగా ఉందని రాజ్ పాల్ సింగ్ అంటున్నారు. దేశానికే గుర్తింపు తెచ్చిన ప్లేయర్స్ కు తను సెక్యూరిటీ ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నాడు.

    ఐపీఎల్ చూసేందుకు వచ్చిన వారిలో తన అభిమానులు కూడా ఉన్నారని చెప్పుకచ్చారు రాజ్ పాల్ సింగ్. విధులు నిర్వర్తిస్తున్న తన వద్దకు వచ్చి ఆటో గ్రాఫ్ సైతం అడుగుతుంటారని చెప్పారు. ఒకప్పుడు హకీ ప్లేయర్ గా దేశానికి బంగారు పతకం తేవడం ఒకింత గర్వంగా కూడా ఉందన్నారు.

    Share post:

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related