యాంటి బయాటిక్ డ్రగ్స్ వాడకంలో భారత్ నెంబర్ వన్ పొజీషన్ లో ఉంది. ప్రతీ ఏటా కేవలం యాంటి బయాటిక్ మాత్రల కోసమే ఏకంగా 500 కోట్లకు పైగా టర్నోవర్ జరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి. కరోనా కష్టకాలంలో డోలో 650 ఎక్కువగా సేల్ అయ్యింది. డోలో 650 మాత్రలు కోట్ల కొద్దీ సేల్ అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి.
కేవలం 2019 సమ్వత్సరంలోనే 500 కోట్లకు పైగా టర్నోవర్ జరిగిందట. ఇక అప్పటి నుండి ప్రతీ ఏటా 500 నుండి 700 కోట్ల టర్నోవర్ సాగుతోందని అంటున్నారు. అప్పట్లో డోలో ఎక్కువగా సేల్ అవ్వగా ఇటీవల కాలంలో అజిత్రోమైసిన్ -500 ఎంజీ ఎక్కువగా అమ్ముడుపోతుంది.