అమెరికాలో మిస్ ఇండియా యూఎస్ ఏ 2022 పోటీలు జరిగాయి. కాగా ఆ పోటీలలో మిస్ ఇండియా యూఎస్ఎస్ రన్నరప్ గా సంజన నిలిచింది. సంజన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన పేర్రాజు – కృష్ణవేణి దంపతుల మనవరాలు. సంజన తల్లిదండ్రులు రంగరాజు – మధు గత ఇరవై సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నారు. తమ వారసురాలు సంజన మిస్ ఇండియా యూఎస్ఎస్ రన్నరప్ గా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. సంజనకు పలువురు ప్రవాసాంధ్రులు అభినందనలు తెలియజేస్తున్నారు.
Breaking News