ప్రముఖ వ్యాపారవేత్త , దేశీయ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్ ఝున్ వాలా కన్నుమూశారు. గతకొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఝున్ ఝున్ వాలా ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వెళ్లారు. ఇక ఈరోజు ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే గుండెపోటుతో మరణించినట్లుగా డాక్టర్లు తెలిపారు. దాంతో ఝున్ ఝున్ వాలా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. 1960 జూలై 5 న రాకేష్ ఝున్ ఝున్ వాలా హైదరాబాద్ లో జన్మించడం విశేషం. ఝున్ ఝున్ వాలా కు చిన్నప్పటి నుండే వ్యాపారం పట్ల మక్కువ ఎక్కువ కావడంతో వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాడు. భారత బులియన్ మార్కెట్ ని శాసించగలిగే స్థాయికి చేరుకున్నాడు. రాకేష్ ఝున్ ఝున్ వాలా మృతికి పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.