ది కశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిసాడు. అభిషేక్ అగర్వాల్ ఇంట్లో శుభకార్యం ఉండటంతో ఆ కార్యక్రమానికి డార్లింగ్ ప్రభాస్ ను కూడా ఆహ్వానించాలని భావించారు. దాంతో ప్రభాస్ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. అగర్వాల్ ఆహ్వానాన్ని మన్నించిన ప్రభాస్ తప్పకుండా మీ ఇంట జరిగే శుభకార్యానికి తప్పకుండా వస్తానని మాట ఇచ్చాడట.
డార్లింగ్ ప్రభాస్ తాజాగా మారుతి దర్శకత్వంలో నటించడానికి సమాయత్తం అవుతున్నాడు. హర్రర్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో భారీ ఎత్తున హౌజ్ సెట్ వేశారు. దాదాపు సగానికి పైగా షూటింగ్ ఈ హౌజ్ సెట్ లోనే జరుగనుందట. ఇక అభిషేక్ అగర్వాల్ విషయానికి వస్తే …..
… విభిన్న కథా చిత్రాలను నిర్మిస్తూ తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. అలాగే డార్లింగ్ ప్రభాస్ తో కూడా పాన్ ఇండియా సినిమా నిర్మించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.