37.8 C
India
Saturday, May 18, 2024
More

    ఎన్టీఆర్ డెడ్లీ డెడికేషన్ ..!

    Date:

    NTR deadly dedication
    NTR deadly dedication

    ఏ పాత్రల్లోకైనా పరకాయ ప్రవేశం చేసే యంగ్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ముందుంటుంది. సినిమా కోసం ఎంతటి రిస్క్ చేయడానికైన రెడీ అవుతుంటాడు ఆయన. అప్పటికప్పుడు 6 ప్యాక్ లుక్ కోసం జిమ్ముల్లో కఠోరంగా శ్రమిస్తాడు. అవసరం లేదు అనుకుంటే తిరిగి సాధారణ స్థితికి రూపాన్ని తెచ్చుకుంటాడు. రీసెంట్ గా RRR కోసం తన కెరీర్ లోనే అత్యుత్తమైన లుక్ తో ఫిట్ గా కనిపించిన ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల శివ సినిమా కోసం కూడా మేకోవర్ మార్చుకోబోతున్నాడన్న న్యూస్ ఆసక్తిరేపుతోంది.

    ఆర్‌ఆర్‌ఆర్‌ లోని కొమురం భీమ్‌ పాత్ర కోసం గతంలో కంటే కాస్త బరువు పెరిగాడు తారక్. అయితే కొరటాల శివ సినిమా కోసం చాలా బరువు తగ్గుతున్నాడట. పర్ఫెక్ట్ ఫిట్ గా కనిపించబోతున్నాడట.. గతంలో ఉన్నంత బొద్దుగా కూడా కాకుండా చాలా స్లిమ్‌ గా చాలా స్టైలిష్ గా ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు చెబుతున్నారు. అంతే కాదు.. చాలా స్ట్రిక్ట్ గా ఒకే లుక్ లో కనిపించేందుకు మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంటున్నాడట.

    బరువు తగ్గిన ఎన్టీఆర్ తన ఫిజిక్ ను అదే విధంగా మెయింటెన్ చేయడం తో పాటు యాక్షన్ సన్నివేశాల విషయంలో గతంతో పోల్చితే కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. అందుకోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం పాల్గొంటున్న షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. మొత్తానికి జనతా గ్యారేజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండాలనే ఉద్దేశ్యంతో తీవ్ర కసరత్తు చేస్తున్నారట. చూడాలి మరి ఈ కష్టం ఎంత సక్సెస్ ని తీసుకొస్తుందో.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...