యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కు భారీ కమ్ బ్యాక్ ఇచ్చిన మూవీ విక్రమ్. ఆ సినిమాలో మాస్ అవతార్ లో ఆయన చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇక బాక్సాఫీస్ వద్ద విక్రమ్ మూవీ క్రియేట్ చేసిన రికార్డులు కూడా అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాకు వచ్చిన లాభాలతో కమల్ హాసన్ ఏకంగా తన అప్పులన్నింటిని తీర్చేశాడని కూడా చెప్పుకున్నారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. అయితే తాజాగా ఆ సీక్వెల్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటు స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్ మెయిన్ రోల్స్ చేశారు. ఇక క్లైమాక్స్ లో హీరో సూర్య కూడా రోలెక్స్ పాత్రలో కనిపించి ఆడియెన్స్ కు విజువల్ ఫీస్ట్ ఇచ్చాడు. సూర్య ఎంట్రీతో సినిమా మరో రేంజ్‌కు వెళ్లింది. సెకండ్ పార్ట్ లో ఆయన రోల్ ఎక్కువగా ఉంటుందని అర్థం కావడంతో విక్రమ్-2పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి మరో క్రేజీ న్యూస్ అత్యంత ఆసక్తి రేపుతోంది.
విక్రమల్ 2లో సూర్య మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆయనతో పాటుగా మరో వెర్సటైల్ యాక్టర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన మరోవరో కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. ఆల్ రెడీ సూర్య క్యారెక్టర్ పై ఎక్స్ పెక్టేషన్స్ హై లెవెల్ లో ఉన్నాయి. ఇక విక్రమ్ కూడా తోడైతే మామూలుగా ఉండదు.. చూడాలి మరి లోకేష్ వీరిని ఎలా మేనేజ్ చేస్తాడో..