38.6 C
India
Sunday, June 2, 2024
More

    MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఎమ్మెల్సీ కవితకు మరో షాక్!

    Date:

     

    MLC KAvitha
    MLC KAvitha

    MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు పెద్ద షాక్ తగలింది. ఏకంగా ఢిల్లీ న్యాయస్థానమే కవితపై ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు ఈడీ, సీబీఐ మాత్రమే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేసింది. కానీ ఇప్పడు బీఆర్ఎస్ కు అతి పెద్ద షాక్ తగిలింది. ఏకంగా న్యాయమూర్తే ఆధారాలున్నాయని చెప్పడం ఇబ్బందికర  పరిస్థితులను తెచ్చింది. స్కాం ద్వారా కవిత లాభాలు ఆర్జించారని, పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారనేందుకు ఆధారాలు ఉన్నాయని  రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక స్థానం స్పష్టం చేసింది.

    నిధుల బదిలీ, ఆస్తుల క్రయ విక్రయాలు కవిత ఆదేశానుసారమే జరిగినట్లు ప్రాథమికంగా ఆర్థమవుతున్నది. అని పిళ్లై బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ న్యాయస్థానం అభిప్రాయపడింది.  పిళ్లై తన పేరిట ఆస్తులు కొనుగోలు చేయడలేదని చార్జిషీటు లో ప్రాథమిక ఈడీ పేర్కొనడాన్ని చూస్తే కవిత కోసం బినామీ లావాదేవీ చేసినట్లు అర్థమవుతున్నదని పేర్కొంది.

    ఈడీ సమర్పించిన ప్రాథమిక ఆధారాల ప్రాకరం ఈ కేసులో అరుణ్ పిళ్లై ప్రధాన నిందితుడని రుజువవుతున్నదని స్పష్టం చేసింది.  2022 ఏప్రిల్ లో ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ లో విజయ్ నాయర్, కవిత మధ్య భేటీలోనూ ఆయన పాల్గొన్నట్లు  కోర్టు గుర్తించింది. మద్యం విధానం రూపకల్పన , అమలు సమయంలో సౌత్ గ్రూపునకు హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయినపల్లి, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు గోరంట్ల, మద్యం వ్యాపారి వినయ్ బాబు ప్రాతినిథ్యం వహించినట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది.

    అయితే కోర్టు తీర్పు కవిత, బీఆర్ఎస్ కు పెద్ద షాకే అని చెప్పవచ్చు. దర్యాప్తు సంస్థలు చాలా రోజులుగా కవిత విషయంలో సైలెంట్ గా ఉంటున్నాయి. అయితే కోర్టులో కవిత పేరు మళ్లీ తెరపైకి రావడం కొంత నష్టం కలిగించే అంశమే. ఢిల్లీ లిక్కర్ స్కాం తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. తమ పాత్ర లేదని, కేంద్రం తన  దర్యాప్తు సంస్థలతో ఇబ్బందులు పెడుతున్నదని కవిత తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే తాజాగా న్యాయస్థానమే కవిత పాత్రపై ఆధారాలున్నాయని చెప్పడం తెలంగాణలో కలకలం రేపుతున్నది. మరి రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు  బయటకు వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    BRS : బీఆర్ఎస్ కథ ముగిసినట్లేనా?

    BRS : తెలంగాణో పదేళ్ల పాటు అధికారం చెలాయించిన కేసీఆర్ పార్టీ...

    Road Accident : ఓఆర్ఆర్ పై ట్యాంకర్ బీభత్సం.. ఆగి ఉన్న కార్లను ఢీకొన్న లారీ.. ఇద్దరి మృతి

    Road Accident : హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం...

    Viral Video : కోతుల దాహం ఎలా తీర్చాడో చూడండి..!

    Viral Video : మనిషి అన్న తర్వాత కొంత దయాగుణం ఉండాలి....

    KTR : ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటం: కేటీఆర్

    KTR : తెలంగాణ ఆవిర్భావ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : బీఆర్ఎస్ కథ ముగిసినట్లేనా?

    BRS : తెలంగాణో పదేళ్ల పాటు అధికారం చెలాయించిన కేసీఆర్ పార్టీ...

    KTR : ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటం: కేటీఆర్

    KTR : తెలంగాణ ఆవిర్భావ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

    Sonia Gandhi : రాష్ట్ర అవతరణ వేడుకలకు రాని సోనియాగాంధీ.. కారణం ఇదే..!

    Sonia Gandhi : రేపు (జూన్ 2) తెలంగాణ రాష్ట్ర 10వ...

    Kondagattu : ఆంజనేయస్వామి భక్తులతో కొండగట్టు కాషాయమయం

    Kondagattu : శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం కాషాయమయమైంది. కొండగట్టులో హన్మాన్...