33.9 C
India
Monday, June 17, 2024
More

    Vastu Puja : శ్రీమద్రామాయణము : “వాస్తు పూజల ఆవశ్యకత”

    Date:

     

    Vastu Puja
    Vastu Puja

    “”న చ వ్యాధి భయం తస్య నచ బంధుజనక్షయః|,
    జీవేద్వర్షశతం వసేన్నరః||,( బ్రహ్మాండపురాణము)

    గృహ ప్రవేశాల సమయములో వాస్తు పూజ చేయడము సర్వసామాన్యము. ఇలా వాస్తు పూజ వల్ల వ్యాధి భయము ఉండదు..అంతేకాదు ఆత్మీయులు,బంధుగణమందరు క్షేమముగ యుంటారు.భోదాయన మహర్షి మొదలు అందరు ఈ వాస్తు పూజ అత్యవసర కర్తవ్యమని పేర్కొన్నాయి.మరి ఈ వాస్తుపూజల విషయములో రామాయణము మనకి ఏమైనా చెప్పిందా అని యోచిస్తే,
    “” ఐణేయం మాంసమహృత్య శాలం యక్షామహే వయం|,
    కర్తవ్యం వాస్తుశమనం సౌమిత్రే! చిరజీవిభిః||,(అయో.కాం.58-22),

    ఓలక్షణా ! దీర్ఘాయురారోగ్యముల కొరకై నూతన గృహాలలో ప్రవేశించు వారు వాస్తుశాంతిని తప్పక చేయవలెను.ఓ సౌమిత్రీ నీవు గజకందము అను దుంపను తీసుకొని రమ్ము.తర్వాతనే వాస్తుపూజ చేసి పర్ణశాలలో ప్రవేసింతము.

    ఇక్కడ కొందరు “”ణేయమ్ మాంసమ్” అను పదాలని మాంసపు ముక్కలుగ వ్యాఖ్యానాలు చేస్తుంటారు.”ణేయమ్ మాంసమ్ అనగా గజకందము అనబడు దుంప అని గ్రహించాలి.దీనికి మద్దతుగ రాముని మనమందరము ఆడినమాట తప్పని వానిగ గుర్తించాము.కారణము రాముడే స్వయముగ “” రామోద్విర్నాభిభాషతే” ఆడినమాట తప్పనని రాముని ప్రతిజ్ఞ చేసాడు.ఈ ప్రస్తావన ఎందుకంటే రాముడు వనవాసములో కేవలము కందమూలఫలములు మాత్రమే తిని జీవించాలని నిర్ణయించాడు.

    “” ధర్మేమేవ చరిష్యామః తత్ర మూలఫలాశనాః””(అయో.కాం.54-16),,
    ఓ లక్ష్మణా! తండ్రిగారి ఆదేశం మేరకు మనము తపోవనాలలో ప్రవేశిస్తున్నాము.ఇక మనము కంద మూలఫలములను మాత్రమే తినుచు వానప్రస్థ ధర్మమును ఆచరించెదమని అంటాడు.దీనిని బట్టి రాముడు వనవాస సమయములో కేవలము కందమూల ఫలములనే తినాలని ప్రతిజ్ఞచేసినట్లు తెలుస్తున్నది. కనుక ణేయమ్ మాంసమ్ అనునది భోదాయనుల వ్యాఖ్యానము ప్రకారము గజకందమను దుంపగానే గ్రహించవలెను.

    కనుక నూతన గృహ ప్రవేశాల సమయములో వాస్తుపూజ తప్పనిసరి యని రామాయణము మనకి నిర్దేశించిన విషయములు మనందరికి శిరోధార్యాలు.

    Share post:

    More like this
    Related

    Nellore : కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు-ముంబై హైవేపై ఘటన

    Nellore : వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది....

    Visakhapatnam : విశాఖలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు ఘన స్వాగతం

    Visakhapatnam : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంతి అచ్చన్నాయుడులకు విశాఖలో...

    RGV Beauty : రాము బ్యూటీ ఇలా మారిందేంటి? ఆధ్యాత్మికత దిశగా గ్లామర్ డాల్..

    RGV Beauty : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ రాము (రాంగోపాల్ వర్మ)...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sampoorna Ramayanam : శ్రీ సాయి దత్త పీఠం ఆలయంలో రామాయణ ప్రవచనం..

    Sampoorna Ramayanam : ప్రపంచ నలుమూలల హిందువులు సనాతన ధర్మాన్ని దశ...

    మళ్లీ టీవీలోకి రామానంద్ సాగర్ ‘రామాయణ్’.. ఏ తేదీ నుంచి ప్రసారం అంటే..

    1980 దశకం చివరలో వచ్చిన ఐకానిక్ టెటీ సీరియల్ ‘రామాయణం’ మళ్లీ...

    శ్రీరామనామ స్మరణతో మారుమ్రోగుతున్న యావత్ భారతం

    జై శ్రీరామ్ ......జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంతో మునిగి తేలుతోంది...