28.5 C
India
Sunday, May 19, 2024
More

    2018 Movie : 15 కోట్లతో నిర్మిస్తే 200 కోట్ల వసూళ్లు.. 2018 మూవీతో అల్లు అరవింద్ జాక్ పాట్..!

    Date:

     

     

    2018 Movie : ఈ మధ్య ప్రేక్షకుల ఆలోచన విధానం మారడంతో కంటెంట్ బాగుంటే హీరో హీరోయిన్ ఎవరో కూడా చూడడం లేదు.. అలాగే చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది చూడడం లేదు.. అలాగే పరభాషా చిత్రాలను కూడా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే పరభాషా సినిమాలు కూడా ఈ మధ్య చాలానే సూపర్ హిట్ అయ్యాయి.. ఇక తాజాగా మరో సినిమా తెలుగులో రిలీజ్ అయ్యిన విషయం తెలిసిందే..

    కాంతారా వంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న గీతా ఆర్ట్స్ 2018 అనే సినిమాను తెలుగు లోకి తీసుకు వచ్చారు. జూడ్ ఆంటోనీ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మలయాళంలో తెరకెక్కింది. మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన ‘2018’ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు.. 2018లో కేరళ రాష్ట్రంలో అతలాకుతలం చేసిన వరదల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

    వరదల్లో చిక్కుకున్న వారంతా ఎలా బయట పడ్డారు ఆ తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి వంటి కథ కథనాలతో ఈ సినిమా యూనివర్సల్ కథాంశం తో ఎమోషనల్ గా తెరకెక్కింది.. మరి తెలుగు రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో.. క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో తెలుసుకుందాం..

    15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఆరంభం లోనే మంచి టాక్ వచ్చింది.. ఈ టాక్ తోనే ఏకంగా అక్కడ 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి మళయాళంలోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది. జీఏ2 పిక్చర్స్ ద్వారా అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 11.02 కోట్ల గ్రాస్ తో పాటు 5.42 కోట్ల షేర్ ను వసూలు చేసింది. క్లీన్ హిట్ గా నిలిచినా ఈ సినిమాతో 3.42 కోట్ల లాభాలను నిర్మాతలు అందుకున్నారు.. ఇక ఇప్పుడు ఓటిటి రిలీజ్ కావడంతో 13 రోజుల్లోనే థియేట్రికల్ రన్ ముగిసింది అనే చెప్పాలి..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ‘2018’ movie : తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ‘2018’ మూవీ.. మీరు చూసారా?

        '2018' movie : ఈ మధ్య ప్రేక్షకుల ఆలోచన విధానం మారడంతో...