34.3 C
India
Wednesday, May 15, 2024
More

    NTR : ఎన్టీఆర్ డైట్ తెలుసా? అందుకే ఇలా ఉన్నాడు!

    Date:

    NTR
    NTR

    NTR రంగు ప్రపంచంలో హీరోలు, హీరోయిన్లు నిలదొక్కు కోవాలంటే ఫిజిక్ బాగుండాలి. హీరోలకు ఇదే ప్రధానంగా ఉండాలి. ఇక హీరోయిన్లను ఫిజిక్ తో పాటు గ్లామర్ ఉండాలి. చాలా మంది హీరోయిన్లు అందం కాపాడుకునేందుకు రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. ఆకలి ఉన్నా.. తినాలి అనిపించినా నోరు కట్టేసుకుంటారు. జీరో సైజ్ కోసం కడుపును మాడుస్తుంటారు. ఇందులో కొంత మంది హీరోలు మాత్రం ఏమీ పాటించరు. కడుపునిండా తింటూ కావాల్సినంత వర్కవుట్లు చేసి మంచి ఫిజిక్ మెయింటెన్ చేస్తారు. ఆ లిస్టులోకే వస్తాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ కెరీర్ ఫస్ట్ హాఫ్ లో చాలా లావుగా ఉన్నారు. దీంతో రాజమౌళి ఫిజిక్ మార్చుకుంటేనే కెరీర్ లో ఎదుగుతారని చెప్పారట. ఇక అప్పటి నుంచి ఆయన తెగ స్లిమ్ అయ్యాడు. యమదొంగ సినిమాలో ఆయన లుక్ చాలా స్లిమ్ గా అనిపించింది.

    ఎన్టీఆర్ లాస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’కు రెండు ఆస్కార్లు వచ్చాయి. ఇక ఆయనకు వరుస పెట్టి ప్రాజెక్టులు వస్తున్నాయి. యంగ్ టైగర్ డైట్ మెనూ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మొదటి నుంచి బయటి ఫుడ్ ను పెద్దగా ఇష్టపడరట ఎన్టీఆర్. స్వీట్స్ కూడా ఆయనకు పెద్దగా ఇష్టం ఉండవట. ఒకవేళ తినాలి అనుకుంటే బెల్లంతో చేసినవి మాత్రమే ఇష్టపడతారట. ఫుడ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కారట మార్నింగ్ రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగుతారట, ఆ తర్వాత అరగంట నార్మల్ వాక్ లేదంటే యోగా, జిమ్ చేసి ఫ్రెష్ అవుతారట. ఆ తర్వాత వెంటనే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటారట.

    గంట గ్యాప్ ఇచ్చి ఇంట్లో చేసిన రాగిజావ 2 గ్లాసులు తాగి వర్క్ చూసుకుంటారట. మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంటకు రాగి సంకటి, నాటుకోడి కూర ఇష్టంగా తింటారట. తిన్న తర్వాత పది నిమిషాలు అటూ ఇటూ తిరిగి సాయంత్రం పండ్ల రసం తాగుతారట. ఇక నైట్ డిన్నర్ లో ఎటువంటి ఫుడ్ తీసుకోరు. ఒక వేళ తింటే ఫ్రూట్ బౌల్.. లేదా జ్యూస్ అదీకాకుంటే నాన పెట్టిన గింజలు తీసుకుంటారట.

    ఇక బెడ్ పైకి చేరుకునే ముందు రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగుతారాట. ఇది ఆయన రొటీన్ డైట్. షూటింగ్ లో ఉన్నప్పుడు మాత్రం ఇంటి నుంచి తప్పకుండా భోజనం వస్తుందట. మార్నింగ్ ఇంటి నుంచి షూటింగ్ కు వెళ్లేప్పుడు రాగిజావ తాగి వెళ్తారట. ఇక అక్కడ ద్రవ పదార్థాలు (వాటర్, ఫ్రూట్ జ్యూస్) తప్పితే ఘన పదార్థాలు తీసుకోరట.
    ముఖ్యంగా ఎన్టీఆర్ కు మధ్యాహ్నం కచ్చితంగా రాగి సంకటి నాటుకోడి పులుసు ఉండాల్సిందేనట. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు ఇంటిలో అందరూ ఇదే డైట్ ఫాలో అవుతుంటారు. అందుకే అంత స్ట్రాంగ్‌గా ఉంటారు అంటున్నారు ఆయన ఫ్యాన్స్

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...