38.1 C
India
Sunday, May 19, 2024
More

    Lokesh : గన్నవరంలోకి లోకేశ్ గ్రాండ్ ఎంట్రీ.. వైసీపీలో వణుకు

    Date:

    Lokesh
    Lokesh

    Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్ర జోరుగా కొనసాగుతున్నది. ఇప్పటికే 2500 కిలోమీటర్లు పూర్తయ్యింది. ఈయన ఆదివారం అర్ధరాత్రి గన్నవరం నియోజకవర్గానికి చేరుకున్నారు. జోరు వర్షం కురుస్తు్న్నా ఆగకుండా, అర్ధరాత్రి 2గంటలకు గన్నవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. సోమవారం తెల్లవారుజామున ఆయన గన్నవరంలోకి అడుగుపెట్టగానే శ్రేణులు, స్థానికులు పార్టీ జెండాలతో ఘనంగా స్వాగతం పలికారు. నియోజవకవర్గంలోని పెలుమనూరులో ఆయనకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు.

    గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి జంప్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ పైనే తిరుగుబాట చేశారు. టీడీపీ కార్యాలయాన్ని తన అనుచరులతో ధ్వంసం చేయించారు. దీనిని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈసారి ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలని అనుకుంటున్నారు. లక్ష మంది భారీ బహిరంగ సభకు శ్రేణులు సిద్ధమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సభకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. అయితే మరోవైపు వైసీపీ కీలక నేత యార్లగడ్డ ఆదివారం టీడీపీ  అధినేత చంద్రబాబును కలిశారు. సోమవారం గన్నవరంలో యువనేత లోకేశ్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. ఆయన అనుచరులతో కలిసి టీడీపీలో చేరబోతున్నారు. దీంతో ఈ బహిరంగ సభకు మరింత ఊపు వచ్చింది. నారా లోకేశ్ పాదయాత్రను నియోజవకర్గంలో సక్సెస్ చేసే బాధ్యత ఇక ఆయనకు దక్కబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే టీడీపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేసినా, యార్లగడ్డ రాకతో మరింత జోష్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తున్నది. ఇక ఇక్కడి నుంచే వల్లభనేని వంశీకి గట్టి సవాల్ తెలుగుదేశం విసరబోతున్నట్లుగా సమాచారం.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    AP Attacks : భగ్గుమంటున్న ఏపీ.. పెట్రోల్ బాంబులు, కత్తులతో దాడులు

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయినప్పటి.. ఆ వేడి మాత్రం...