31.9 C
India
Friday, May 17, 2024
More

    Kriti Kharbanda : నా గదిలో సీక్రెట్ కెమెరా! కృతి కర్బందా సంచలన వ్యాఖ్యలు..

    Date:

    Kriti Kharbanda
    Kriti Kharbanda

    Kriti Kharbanda : షూటింగ్ కోసం ఇతర ప్రదేశాలకు వెళ్లే హీరోయిన్స్ కు తిప్పలు తప్పడం లేదు. గతంలో త్రిష బస చేసిన హోటల్ లో సీక్రెట్ కెమెరా ఉందన్న వార్తలు గుప్పుమన్నాయి. కొన్ని వీడియోలు కూడా లీక్ కావడంతో తను కాదని క్లారిటీ ఇచ్చింది త్రిష. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ తరహాలో హీరోయిన్లకు తిప్పలు తప్పడం లేదు. తాము బస చేసే హోటల్ ను ఎలా నమ్మాలి అంటూ కొందరు హీరోయిన్లు మీడియా ముందు బాహాటంగానే తమ గోడు వెళ్లబోసుకున్న సందర్బాలు లేకపోలేదు.

    అయితే ఇటీవల ఒక హీరోయిన్ కు ఇలాంటి తలనొప్పి మొదలైంది. తను ఉంటున్న గదిలో సీక్రెట్ కెమెరా ఉందని తాను కనుగొన్నానని చెప్పింది. అయితే అది అదే హోటల్ లో పని చేసే వ్యక్తి పెట్టినట్లు తమ టీం గుర్తించిందని తెలిపింది. ఈ విషయంను ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలపడంతో ఇండస్ట్రీలోని హీరోయిన్లు, లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు షాక్ కు గురయ్యారు. తమకు బయట ఏ మాత్రం బద్రత లేదంటూ వాపోతున్నారు.

    హీరోయిన్ కృతి కర్బంద గుర్తుండే ఉంటుంది. తీన్ మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త వంటి సినిమాల్లో నటించింది. ఆమెకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఒక ఇంటర్వ్యూ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. ‘ఒక కన్నడ సినిమా షూటింగ్ కోసం అవుట్ డోర్ కు వెళ్లాను, అక్కడ ఒక హోటల్ లో బస చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆ రూమ్ లో ఒక సీక్రెట్ కెమెరా గుర్తించాను. ఎందుకో అనుమానం వచ్చింది. నా బృందాన్ని పిలిచాను. రూమ్ అంతా చెక్ చేయమని చెప్పాను. వారు కూడా చెక్ చేశారు. నిజంగానే సీక్రెట్ కెమెరా దొరికింది. అదే హోటల్ లో పని చేసే వ్యక్తి దాన్ని పెట్టాడని చెప్పాడ’ని చెప్పింది.

    అప్పట్లో ఇది తనను తీవ్రంగా భయపెట్టింది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి వారితో ప్రతీ చోట భయపడుతూ ఎలా బతకాలి అని చెప్పింది. ఎవరైనా ఒక హోటల్ లో బస చేయాలని అనుకుంటే తప్పకుండా చెక్ చేసుకోవాలని సూచించింది కృతి కర్బంద.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kriti Kharbanda : ‘అతడు నా గదిలో సీక్రెట్ కెమెరా పెట్టాడు”.. పవన్ హీరోయిన్ ఆవేదన!

    Kriti Kharbanda : కృతి కర్బందా అంటే చాలా మందికి తెలియక...

    Kriti Kharbanda In Floral Dress

    Kriti Kharbanda Photoshoot