33.2 C
India
Sunday, May 19, 2024
More

    RGV In Kalki : ప్రభాస్ కల్కీకి.. రాంగోపాల్ వర్మకు ఉన్న లింకేంటి.. వైరల్ న్యూస్..!

    Date:

    RGV In Kalki :

    వైజయంతీ మూవీస్ బ్యానర్లో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కీ 2898 ఏడీ’. ఈ సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్.. బిగ్ బీ అమితాబచ్చన్.. విశ్వనటుడు కమల్ హాసన్.. వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అపేడ్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలై ‘కల్కీ’పై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా కల్కీ 2988 ఏడీ షూటింగ్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అతిథి పాత్రలో కన్పించనున్నారట. ఆయనకు సంబంధించిన షూటింగ్ సైతం తాజాగా పూర్తయిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన ఇమేజ్ లు సైతం కొన్ని ట్విటర్లో కన్పించాయి.

    కాగా గతంలోనూ అగ్ర దర్శకుడు రాజమౌళి సైతం ‘కల్కీ’ షూటింగులో పాల్గొన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ సైతం ఈ సినిమాలో కనిపించనున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. ఈ ఇద్దరు దర్శకులు సినిమాలో ఉన్నారా? లేదా అనే క్లారిటీని మాత్రం ‘కల్కీ’ టీం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు.

    కాగా రాజమౌళి మరియు రాంగోపాల్ వర్మ ఇద్దరు కూడా ఈ సినిమాలో కన్పిస్తే మాత్రం సినిమాపై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా ‘కల్కీ 2898’ టీం ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Kalki 2898 AD : కల్కి కాలం కలిసి వచ్చేనా.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా.. కనిపించని హైప్..

    Kalki 2898 AD : ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,...