33.2 C
India
Sunday, May 19, 2024
More

    Balakrishna : తనలాగే జైల్లో ఉంచాలనే అరెస్టు.. చంద్రబాబు తప్పేం లేదు. బాలకృష్ణ కౌంటర్

    Date:

     Balakrishna counter on chandrababu arrest
    Balakrishna counter on chandrababu arrest

    Balakrishna :

    టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై అందరూ స్పందిస్తున్నారు. దీనిపై సొంత ఆయన బావమరిది బాలకృష్ణ కూడా స్పందించారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదంతా వైసీపీ కుట్రలో భాగమేనని పేర్కొన్నారు.

    జగన్ 16 నెలలు జైల్లో ఉన్నడాని, అందుకే తనలా అందరిని జైలుకు పంపాలని అనుకుంటున్నాడని పేర్కొన్నారు.  టీడీపీ అధినేత చంద్రబాబును 16 నిమిషాలు అయిన జైలులో ఉంచాలని ఉద్దేశంతో అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మేలు చేయడం మరిచిపోయి, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు.  14 ఏళ్లు ముఖ్యమంత్రి గా చేసిన నాయకుడిని ఈ విధంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని బాలయ్య ఖండించారు. జగన్ అన్నం తినడం మానేసి, కోర్టుల చేతుల్లో పదే పదే తిట్లు తింటున్నాడని మండిపడ్డారు.

    చంద్రబాబును అరెస్ట్ చేసి, ఒక్క రోజైనా జైల్లో పెట్టడమే తన జీవిత లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పెట్టుకున్నారని బాలకృష్ణ ఎద్దేవా చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారని నిలదీశారు. రాజకీయ కక్ష సాధింపు లో భాగమే ఈ అరెస్ట్ అని వ్యాఖ్యానించారు. 2021 డిసెంబర్ లో కేసు నమోదైతే ఇంతవరకు చార్జీషీట్ ఎందుకు దాఖలు చేయలేదో చెప్పాలని నిలదీశారు. ఇలాంటి అక్రమ కేసులకు చంద్రబాబు, టీడీపీ భయపడబోదని , దీనిపై న్యాయపోరాటం చేస్తామని, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

    Share post:

    More like this
    Related

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...