38.1 C
India
Sunday, May 19, 2024
More

    Canada – India : మిత్ర దేశాల సాయం కోరిన కెనడా.. భారత్ పాత్ర ఉందని తేలితే ఇబ్బందులు తప్పవా..?

    Date:

    Canada – India :

    ఖలిస్థాన్ వేర్పాటు వాద మద్దతు దారు నిజ్జార్ హత్య ఇప్పుడు భారత్, కెనడా ల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే గతేడాది జరిగిన ఈ హత్య ఇప్పుడు రాజకీయంగా విభేదాలకు కేంద్ర బిందువైంది. భారత్ కు  మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఈ హర్దీప్ సింగ్ నిజ్జార్ పై కొంతకాలంగా భారత్ నిఘా పెట్టినట్లు సమాచారం.  అయితే అనుకోకుండా ఆయన హత్యకు గురయ్యారు. దీని వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపణలు కలకలం రేపాయి. దీంతో పాటు భారత దౌత్యవేత్తను కూడా కెనడా బహిష్కరించింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.

    అయితే ఈ కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ పై ఆరోపణలు చేస్తున్న కెనడా, తాజాగా తన మిత్ర దేశాలైన అమెరికా, అస్ర్టేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ సాయం కోరింది. తమ ఏజెంట్లను పంపి, తమ పౌరుడిని హత్య చేయడమే కాకుండా తమపై ఎదురు దాడి చేస్తోందంటూ జస్టిస్ ట్రూడో తన నాలుగు మిత్రదేశాలకు సమాచారం పంపారు. దీంతో ఆయా దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న భారత్ కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది.

    అయితే ఇప్పుడు కెనడాలో ఉన్న భారతీయుల రక్షణ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇప్పడు భారతీయులు ఎక్కువగా ఉన్న దేశంగా 16 లక్షల మంది భారతీయ మూలాలు కలిగిన వారు ఆ దేశంలో ఉన్నారు. కెనడాలో భారత విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో నే ఉన్నారు. కెనడాతో భారత వాణిజ్యంపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. రెండు దేశాల మధ్య 11.68 బిలియన్ల యూఎస్ డాలర్ల బిజినెస్ ఉంది. అయితే ఏదేమైనా జీ 20 సదస్సు విజయవంతం అయిన తర్వాత ఈ రకమైన వివాదం తెరపైకి రావడ ఇప్పుడు భారత్ కు ఇబ్బందికరంగా మారింది. నిజ్జార్ హత్యపై విచారణకు సహకరించాలని ట్రూడో ఇప్పటికే భారత్ ను కోరారు. భారత్ మాత్రం దీనిపై మౌనం వహిస్తున్నది. అయితే ఇప్పుడు ఈ హత్యపై కెనడా సేకరించిన సాక్ష్యాలు తమ మిత్రదేశాలతో పంచుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇందులో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని తేలితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...