36.8 C
India
Tuesday, May 21, 2024
More

    Skanda Movie Review : ‘స్కంద’ రివ్యూ.. రామ్ కు బోయపాటి మాస్ హిట్ ఇచ్చాడా?

    Date:

    Ram Pothineni 'Skanda' Movie Review
    Ram Pothineni ‘Skanda’ Movie Review

    Skanda Movie Review :
    టాలీవుడ్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న క్రేజీ సినిమాల్లో ”స్కంద” ఒకటి.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”స్కంద” పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబోలో ఎలాంటి మూవీ వస్తుందా అని ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఎదురు చూపులకు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడింది..

    రామ్ – బోయపాటి చేస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఇద్దరు కూడా చాలా కష్ట పడ్డారు. ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. ఇప్పటికే ప్రీమియర్స్ కూడా పడడంతో ఆడియెన్స్ ట్విట్టర్ లో రివ్యూలు కూడా పెట్టేస్తున్నారు.. ఇదిలా ఉండగా మరికొద్ది గంటల్లో మన ఇండియాలో కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఇక ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ ఇప్పుడు చూద్దాం..
    రామ్ మరోసారి మాస్ హీరోగా కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. తన లుక్, మ్యానరిజం ముందు నుండి ఆడియెన్స్ ను అలరించింది..  ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాగా థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా విశేషంగా ఆకట్టు కున్నాయి.. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.. మరి రివ్యూ ఇప్పుడు చూద్దాం..
    కథ విషయానికి వస్తే.. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది.. అక్కడ ఒక చిన్న పల్లెటూరులో నివసించే రామ్ తండ్రికి మంచి పేరు ఉంటుంది. ఇతడు ప్రజలకు ఎలాంటి సహాయం కావాలన్న చేస్తూ న్యాయంగా ఉంటారు.. రామ్ కూడా అలానే పెరుగుతాడు.. ఇక శ్రీలీల ఒక సంపన్న భూస్వామి కూతురు.. ఈమె చురుకుగా ఉంటూ రామ్ ను చూసి ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించు కుంటారు.
    అయితే వీరి ప్రేమ కుటుంబాలకు నేరంగా ఉంటుంది.. శ్రీలీల కుటుంబం రామ్ కుటుంబాన్ని అంగీకరించడు.. రెండు కుటుంబాలు శత్రువులు కావడంతో తమ పిల్లలను దూరంగా ఉంచాలని నిర్ణయించు కుంటారు. ఎన్నో సవాళ్ళను, శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రామ్ వీటిని ఎలా పరిష్కరించుకుని.. శ్రీలీల ప్రేమను దక్కించుకున్నాడు? అనేది మిగిలిన కథ..
    స్కంద సినిమా విశ్లేషణ విషయానికి వస్తే.. ఈ సినిమాలో బోయపాటి మార్క్ బాగా కనిపిస్తుంది.. మాస్ మూమెంట్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకునేలా ఉన్నాయి.. ఫస్టాఫ్ లవ్ ట్రాక్, హీరోయిన్ తో కామెడీ సీన్స్ తో సరదాగా సాగుతూ సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉంది.. రామ్, శ్రీలీల డ్యాన్స్ తో కూడా మెప్పించారు.. వీరి డ్యాన్స్ మూమెంట్స్ చూడడానికి ఆడియెన్స్ రెండు కళ్ళు చాలవు అనే చెప్పాలి.. ఇక ఈ సినిమాకు మరో హైలెట్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్ అని చెప్పాలి..
    నటీనటులు విషయానికి వస్తే.. రామ్, శ్రీలీల అందంతో పాటు అభినయం సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు.. వీరి పెయిర్ కూడా ఆకట్టుకుంది. మిగతా నటీనటులు తమ పాత్రల మేర మెప్పించారు.
    ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మొత్తానికి స్కంద బోయపాటి మార్క్ లో ఉంది. బోయపాటి మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు మాస్ ఎంటర్టైన్మెంట్ తో ఎమోషన్స్ జోడించి స్కంద సినిమాను తెరకెక్కించారు. థమన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా బాగున్నాయి.. నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకున్నాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలు మినహా మొత్తంగా మాస్ ఎంటర్టైనర్ అనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    Ram Pothineni : ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డ రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి..?

    Ram Pothineni : ఈ నడుమ సినీ స్టార్లు వరుసగా ప్రేమలో పడి...

    Ram Broke Charan Record : చరణ్ రికార్డు బద్దలు కొట్టిన రాం.. ఇంకా అన్ని కోట్లు వస్తే.. మరో రికార్డు..!

    Ram Broke Charan Record : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా...

    Break Even Skanda : బ్రేక్ ఈవెన్ కు ఈ మూడు రోజులే కీలకం.. స్కందకు కలిసి వస్తున్న సెలవులు

    Break Even Skanda : ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి...