36.9 C
India
Sunday, May 19, 2024
More

    Threat Humanity : ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదం.. మానవాళికి పెనుముప్పు

    Date:

    Threat Humanity
    Threat Humanity

    Threat Humanity : ఇజ్రాయెల్ పై పాలస్తీనాలోని గాజా నుంచి హమాస్ ఉగ్రవాదుల దాడిని చూశాక ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఏకంగా ఇజ్రాయెల్ అత్యాధునిక సాంకేతికను తలదన్ని హమాస్ దాడి చేయడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేసింది. ప్రపంచంలోనే అత్యంత శక్తి వంతమైన ఆయుధ సంపత్తి ఉన్న ఇజ్రాయెల్ పై ఒక్కసారిగా ఒక ఉగ్రవాద సంస్థ దాడి చేయడం ఇప్పుడు ప్రశ్నగా మారింది.

    ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాదం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒక్క హమాస్ మాత్రమే కాదు తాలిబాన్, లష్కరే తోయిబా, ఐఎస్ఐ,  ఇస్లామిక్ స్టేట్స్, ఖలీస్థానీలు.. ఇలా ఎన్నో ఉగ్రవాద సంస్థలు ఆయా దేశాలకు పెనుముప్పుగా మారాయి. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇక అధిపత్యం కోసం ఆయా ఉగ్రవాద సంస్థలకు పలు దేశాలు ఆర్థిక, ఆయుధ సాయం చేస్తుండడం కారణంగా వారు మరింత పేట్రేగిపోతున్నారు. తమ మతం విస్తరణ జరగాలనే ఆకాంక్షతో ఆగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం వేళ్లూనుకుంది. ఎన్నో దేశాల్లో అల్లర్లు, విధ్వంసాలకు ఈ సంస్థలే కారణమవుతున్నాయి.

    ఆయా దేశాల్లో ప్రజలు, సైనికులపై బాంబులతో దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇలాంటి ఉగ్రమూకల ఏరివేతకు దేశాలు చర్యలు తీసుకుంటున్నా, మరింతగా తమ ప్రాబల్యాన్ని చాటుకుంటున్నాయే తప్పా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. సిరియా, నైజీరియా, సోమలియా లాంటి దేశాల్లో ఈ ఉగ్రమూకల నీడలు మరింత పెరిగాయి. ఇక అప్ఘానిస్థాన్, పాకిస్థాన్ లాంటి దేశాలు ఈ ఉగ్రసైన్యాలకు నీడనిస్తున్నాయి. తాజాగా పాలస్తీనా నుంచి లెబనాన్ వరకు హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యం తీవ్రంగా కనిపిస్తున్నది. ఒక్క సారిగా 5వేల రాకెట్ లాంచర్లతో ఇజ్రాయెల్ పై దాడి చేశాయంటే ఎంతగా వారి ప్రాబల్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.

    అనేక దేశాలు తమ అసం, ప్రత్యర్థుల కోసం వీటిని పెంచి పోషించి ఉసిగొల్పుతున్నాయి. ప్రపంచానికే ప్రమాదకరంగా మారుతున్న ఈ ఉగ్రవాద సంస్థలను అంతమొందించేందుకు అగ్రశ్రేణి దేశాలు ఉహ్మడి పోరు చేస్తే తప్పా, దీనికి అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ ఉగ్రవాదాల చేతుల్లో హింసకు గురవుతున్నారు. అతి దారుణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. రానున్న రోజుల్లో ఇలా ఆధిపత్య పోరు మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో మరింత ఎదురు దాడులు ఆయా దేశాలకు ఎదురయ్యే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    Malcolm Words on Media : మీడియా చేస్తుంది కరెక్టేనా.. మాల్కమ్ ఏం చెప్పాడు..?

    Malcolm Words on Media : మాల్కమ్ ఎక్స్ అమెరికాలో మానవ...

    Historical Alabama Capitol : చారిత్రక అలబామా కాపిటల్ ను సందర్శించిన డా. జై గారు.. దీని విశేషాలేంటో తెలుసా?

    Historical Alabama Capitol : అలబామా అమెరికా దేశపు ఆగ్నేయ ప్రాంతపు రాష్ట్రాలలో...

    Mexico Earthquake : మెక్సికోలో పెను భూకంపం.. భవనాలన్నీ పేకమేడల ఎలా ఊగాయో చూడండి

    Mexico Earthquake : మెక్సికో సిటీలో సెంట్రల్ పసిఫిక్ తీరంలో భూకంప ధాటికి...