38.7 C
India
Saturday, May 18, 2024
More

    Attack on Telangana Student : అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై దాడి.. మంత్రి కేటీఆర్ రియాక్షన్

    Date:

    Attack on Telangana student
    Attack on Telangana student in USA, KTR Reaction

    Attack on Telangana student in America : అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై దాడి జరిగింది. యూఎస్ లో ఎంఎస్ చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆ విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం కు చెదిన పుచ్చా వరుణ్ రాజ్ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. .

    అయితే ఇండియానా రాష్ర్టంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చేస్తున్నాడు. వరుణ్ ఎంఎస్ చేస్తూనే పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాడు. మంగళవారం వరుణ్ జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా, ఈ దాడి జరిగింది. ఒక్కసారిగా ఒక అగంతకుడు వరుణ్ పై కత్తితో దాడికి దిగాడు. వరుణ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వరుణ్ ను దవాఖానకు తరలించారు.

    అయితే వరుణ్ రాజ్ పై దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా పోలీసులు తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయంలో వరుణ్ తండ్రి ప్రభుత్వ టీచర్ అయిన రామ్మూర్తి వెంటనే మంత్రి పువ్వాడ అజయ్ ని కలిసి పరిస్థితిని వివరించారు. తన కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని మంత్రిని కోరారు.

    అయితే ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. వరుణ్ కుటుంబానికి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తామని చెప్పారు. అమెరికాలోని రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై మిత్రుల సాయంతో వరుణ్ కు సహకారం అందిస్తామని చెప్పారు. వరుణ్ కుటుంబ సభ్యులతో తన టీం టచ్ లోకి వెళ్తుందని చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....