35.8 C
India
Monday, May 20, 2024
More

    Mohammed Shami : రోడ్డు ప్రమాద బాధితుడిని కాపాడిన షమీ.. 

    Date:

    Mohammed Shami
    Mohammed Shami

    Mohammed Shami : మంచి మనసు చాటు కోవడంలో షమీ తర్వాతనే ఎవరైనా అని నిరూపించుకున్నాడు.  వరల్డ్ కప్ లో పేసింగ్ తో రాణించిన షమీ ఒక ప్రమాద బాధితుడిని కాపాడాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అసలు ఏం జరిగిందంటే..

    శనివారం రాత్రి నైనిటాల్ కు వెళ్లే రోడ్డు మార్గంలో ఒక కారు ప్రమాదం సంభవించింది.  అదుపుతప్పిన కారు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది.  అదే మార్గం గుండా షమీ నైనిటాల్ కు వెళ్తున్నాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు కారు ప్రమాదానికి గురైంది. దీంతో వెనక కారులో వస్తున్న షమీ, ఆ వెనుక వస్తున్న వారు వెంటనే స్పందించారు. కారు వద్దకు వెళ్లి అందులో ఉన్న వ్యక్తిని బయటకు తీసి హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనా విషయాలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇవి వైరల్ గా మారాయి.

    ‘అతడు చాలా అదృష్టవంతుడు, దేవుడు అతనికి పునర్ జీవితం కల్పించాడు. నా ముందు కారు ప్రమాదానికి గురి కావడం.. ఆ వెనకే వస్తున్న నేను ఆ ప్రమాదం గురించి తెలుసుకోవడం.. నా వెనుక వస్తున్న, స్థానికులను అప్రమత్తం చేయడం ద్వారా బాధితుడిని సురక్షితంగా రక్షించగలిగాం. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉంది.’ అని షమీ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు.

    ట్రావెలింగ్ లో భాగంగా..

    తనకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని మ్యాచ్ లు లేకుంటే ఎక్కువ సమయం ట్రావెలింగ్ కే వెచ్చిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఫిషింగ్ చేయడం కూడా ఇంట్రస్టే. లాంగ్ జర్నీలో డ్రైవింగ్ బాగా ఎంజాయ్ చేస్తాను. బైకులు, కార్లు నడుపుతాను. కానీ టీమిండియాకు ఆడడం మొదలు పెట్టిన సమయంలో  బైక్‌ రైడింగ్‌ ఆపేశా. ఒక వేళ ఈ రైడింగ్ లతో గాయాలైతే జట్టుకు ఇబ్బంది అవుతుందని ఆపివేశాను. హైవేలు, విలేజ్ లలో బైకులపై విపరీతంగా తిరిగేవాడిని. బైకులు, కార్లే కాదు ట్రాక్టర్‌, బస్సు, ట్రక్కులను కూడా నడిపేవాడిని. నా ఫ్రెండ్ కు ట్రక్‌ ఉండేది. చిన్న వయసులోనే దాన్ని ఇద్దరం నడిపేవాళ్లం. మాకు ట్రాక్టర్ ఉండేది. ఆ ట్రాక్టర్ తో చెరువులోకి దూసుకెళ్లా అప్పుడు మా నాన్న కొప్పడ్డారు.’ అని షమీ గుర్తు చేసుకున్నాడు.

    Share post:

    More like this
    Related

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...