35.1 C
India
Wednesday, May 15, 2024
More

    H-1B Visa : హెచ్1బీ వీసాదారులకు యూఎస్ గుడ్ న్యూస్.. ఎక్కువ ప్రయోజనం భారతీయులకే..

    Date:

    H-1B visa
    H-1B visa

    H-1B visa : హెచ్-1B స్పెషాలిటీ వర్కర్లు (పరిమిత సంఖ్యలో) జనవరిలో యూఎస్ లో తమ వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చని అమెరికా విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం (నవంబర్ 27) విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

    వీసా అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకున్న వారు ఎక్కువ కాలం వెయిట్ చేయకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని స్టేట్‌సైడ్ వీసా పునరుద్ధరణ పైలట్ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

    కాన్సులర్ వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ట్ విలేకరులతో మాట్లాడుతూ, ‘మేము H-1B వీసాను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగా ముందస్తుగా ఈ 20,000 మందితో ప్రారంభిస్తున్నాం’ అని చెప్పారు. ఇది ఇక్కడ నివసించే వారికి ప్రమోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు.

    భారతీయులకు కలిగే ప్రయోజనం!
    జూన్‌, 2024లో నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా వైట్‌హౌస్ ఈ ప్రణాళికను ప్రకటించింది. ఈ చర్య భారీ సంఖ్యలో భారతీయ సాంకేతిక నిపుణులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. విదేశాంగ శాఖ కొంత కాలంగా ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాతిపదికన ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అయితే, మోదీ పర్యటన సందర్భంగా మాత్రమే అధికారికంగా ప్రకటించారు.

    ఈ వీసా కింద మొదటి 20వేల మందిలో ఎక్కువగా భారతీయులు ఉండే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. ‘భారతీయులు యునైటెడ్ స్టేట్స్‌లో అతిపెద్ద నైపుణ్యం కలిగిన కార్మిక సమూహం. కాబట్టి, ఈ కార్యక్రమం భారతదేశానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. వీసా అపాయింట్‌మెంట్ పొందడానికి ప్రజలు భారతదేశానికి లేదా ఎక్కడికైనా తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది భారత్ లోని కొత్త దరఖాస్తుదారులపై దృష్టి పెట్టడానికి అనుమతిస్తుంది.’ అని ఒక అధికారి తెలిపారు.

    భారీ ప్రయత్నం
    వీసా పునరుద్ధరణ కార్యక్రమం కేవలం వర్క్ వీసాల కోసం మాత్రమే అని అధికారులు పేర్కొంటున్నారు. ‘ఈ నిబంధన ఇప్పటికే ఉన్నా దాదాపు 20 ఏళ్లుగా ఉపయోగించలేదు. ఇవి వర్క్ వీసాలు. ఇది యూఎస్ లో దీర్ఘకాలికంగా నివసిస్తున్నప్పటికీ విదేశాలకు తిరిగి వెళ్లకుండా వారి వీసాను పునరుద్ధరించాలనుకునే వ్యక్తుల కోసం ఉద్దేశించబడిందని’ మరో అధికారి తెలిపారు.

    డిసెంబర్, జనవరి 2024లో 20,000 కేసులతో పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించబోతున్నాం. ఆ తర్వాత దీన్ని విస్తరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే అమెరికా చరిత్రలో ఇది భారీ ప్రయత్నం అనే చెప్పవచ్చు.
    నేషనల్ ఇమ్మిగ్రేషన్ ఫోరమ్ ద్వారా స్టేట్ డిపార్ట్‌మెంట్ కూడా ‘వీసా ప్రాసెసింగ్‌ను మరింత సమర్థవంతంగా చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నందుకు  NIF ప్రెసిడెంట్, మరియు CEO జెన్నీ ముర్రే ప్రశంసించారు.

    Share post:

    More like this
    Related

    Sonam Kapoor : తల్లైనా.. ఏ మాత్రం మారలేదు.. అదే ఎక్స్ పోజింగ్ తో మతి పోగోడుతోంది

    Sonam Kapoor : పెళ్లి చేసుకుని తల్లిగా మారిన కూడా కొంతమంది...

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ బికినీలో.. అందాల ఆరబోత

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ మరో సారి అందాల ఆరబోతతో...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్య

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్యకు గురైన సంఘటన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B Visa : H-1B వీసా రెన్యువల్ వివరాలు ఇవే..

    H-1B Visa : H-1B వీసా రెన్యువల్‌ ను అమెరికా ప్రభుత్వం...

    H-1B Visa : H-1B వీసాల పునరుద్ధరణకు మార్గం సుగమం

    H-1B Visa : అమెరికాలో పని చేసే వృత్తి నిపుణుల కోసం...

    H-1B Visas : 2024 పరిమితికి చేరుకున్న H-1B వీసాలు యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు ఏమంటున్నారంటే?

    H-1B Visas : US సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)...