38.4 C
India
Tuesday, May 14, 2024
More

    YS Jagan : ‘ఎల్లో’ మీడియాను జగన్ రెడ్డే పబ్లిసిటీ చేస్తున్నారా!

    Date:

    CM Jagan
    CM Jagan

    YS Jagan : నెగెటివ్ పబ్లిసిటీ కూడా చాలా సార్లు అవతలి వారికి ప్లస్ అవుతుంది. ఈ మధ్య ఏపీ సీఎం జగన్ రెడ్డి చేసిన పనితో ఆయన వ్యతిరేక మీడియాకు కలిసి వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ ఈనాడు పేపర్ ను చూపించి అందులో ఏముందో చదివి వినిపించారు. బహూషా వెటకారం చేద్దాం అనుకున్నారో ఏమో.. లేకుంటే అందులో రాసింది తప్పని చెప్పాలనా.. ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు కానీ జగన్ ఫ్యాన్స్ కు మాత్రం మనం ఈనాడు పేపర్ కూడా చదవాలా? అన్న సందేహం కలిగిందంటా.

    అసలు ఈనాడు ఏం రాస్తుందో.. అందులో ఏమస్తుందో జగన్, రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఈనాడు ప్రస్థానం ఎప్పటి నుంచి స్ట్రాట్ అయ్యింది అందరికీ తెలిసిందే. దాదాపు జగన్ చడ్డీలో ఉన్నప్పటి నుంచి ఈనాడు రన్ అవుతూనే ఉంది. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దానిపై ఎంత ఫైర్ అయినా ఇసుమంత కూడా వెనక్కి తగ్గలేదు. రామోజీరావును ముప్పు తిప్పలు పెట్టినా రాతలు, పూతలు మాత్రం మానలేదు. ఇప్పుడు కొత్తగా ఈనాడులో.. అని సభలో చెప్పినంత మాత్రాన ఉన్నపలంగా దాని స్టాండ్ మారదు కదా?

    మీడియా ఎప్పుడూ ప్రతిపక్షం పాత్ర పోషించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. కానీ ప్రజల దౌర్భాగ్యమో ఏమో గానీ పార్టీకో మీడియా వచ్చింది. అంటే వారి ప్రభుత్వంలో జరిగే గొప్పలు వారే పేపరై, మైకై కూయాలి.. వారి తప్పులు కూడా అదే విధంగా ప్రచారం చేయాలి. ఈ లెక్కన జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్షి చదవడం ఎక్కువగా అలవాటు చేసుకున్నారు జగనన్న తమ్ముళ్లు. ఇక బహిరంగ సభలో జగనన్న చెప్పిన తర్వాత ఈనాడు చదవకుండా ఉంటారా? ఆయన నెగెటివ్ పబ్లిసిటీ కాస్తా ఎల్లో మీడియాకు ప్లస్ గా మారిందన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది.

    ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘6’ను అంత సీరియస్ గా తీసుకున్నారేమో జగన్ తన ప్రభుత్వంలో కూడా ఏవైనా సరే ‘6’ గ్యారంటీలు ఇవ్వాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో వింతేంటంటే ఈ 6 గ్యారంటీల గురించి చింతలపల్లి సభలో ప్రచారం చేసే సమయంలో పక్కన ఉన్న వాళ్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఇచ్చే గ్యారంటీలు తనకే తలియదన్నమాట. మొత్తంగా జగన్ రెడ్డి కూడా.. తమకు (ఎల్లో్ మీడియా) ప్రచారం చేశారు. అది నెగెటివ్ వేలో వెళ్లినా పథకాలను వైసీపీ క్యాడర్.. సానుభూతి పరుల్లోకి తీసుకెళ్లడం వారికి హ్యాపీగా అనిపిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...