40.3 C
India
Tuesday, May 21, 2024
More

    Etela Rajender : పార్లమెంట్ కు ఈటల పోటీ.. ఎక్కడి నుంచో తెలుసా?

    Date:

    etela rajender
    etela rajender

    Etela Rajender : తెలంగాణలో మోస్ట్ పాపులర్ పొలిటికల్ పర్సన్ ఈటల రాజేందర్. దాదాపు 20 ఏళ్లుకు పైగా హుజూరాబాద్ కు ఎమ్మెల్యేగా ఉన్న నేత కేసీఆర్ తో గొడవ కారణంగా బీజేపీలోకి వెళ్లాడు. 2023 ఎన్నికల్లో పార్టీ మారుతాడని పుకార్లు వచ్చినా ఆ సమయంలో క్లారిటీ ఇచ్చి మరీ బీజేపీ నుంచే రెండు చోట్ల పోటీకి నిలబడ్డాడు. కానీ ఊహించని విధంగా రెండు చోట్లా ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ కు పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు.

    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఈటల కాంగ్రెస్ వైపునకు చూస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. దాదాపు పది రోజులుగా ఎవరి నోట విన్నా ‘కాంగ్రెస్ లోకి ఈటల’ అంటూ వినిపించింది. దీంతో ఆయన మళ్లీ పార్టీ మారుతారా? అన్న సందేహం చాలా మందిలో కలిగింది. దీంతో ఆయన ఈ వందతులకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ..

    ‘ఈ మధ్య నేను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అధికార పార్టీకి చాలా కాలం దూరంగా ఉన్నానని, త్వరలో అధికార పార్టీలో చేరి ఏదో ఒక పదవి తీసుకుంటానని పుకార్లు వస్తున్నాయి. కానీ ఇది నిజం కాదు. తాను గతంలోనే చెప్పాను పార్టీ మాడం లేదని, తాను ఒక పార్టీలోకి వెళ్తే.. అందులోనే ఉంటాను. ఊరికూరికే పార్టీలు మార్చే తత్వం కాదు నాది. ఇది గిట్టని వాళ్లు చేసే దుష్ర్పచారం మాత్రమే’ అని ఈటల చెప్పారు.

    ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై స్పందించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్తూ.. ఏ స్థానం నుంచి అని విలేకరులు ప్రశ్నించగా.. మాల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పుకచ్చారు. అయితే ఈ సారి కూడా ఆయన రాంగ్ స్టెప్ వేస్తున్నారా? అన్న సందేహం చాలా మందికి కలుగుతుంది.

    Share post:

    More like this
    Related

    AP Election Results : ఈ ప్రొఫెసర్ జోస్యం ఫలించేనా.. ఏపీలో గెలుపు నల్లేరుపై నడకేనా..

    AP Election Results : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, ఏపీల్లో...

    Jake Fraser McGurk : ఈ భీకర ప్లేయర్ బెంచ్ కే పరిమితం.. ఆసీస్ బోర్డుపై రికీ పాంటింగ్ విమర్శలు

    Jake Fraser McGurk : జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ఢిల్లీ...

    KTR : చేసిన తప్పు ఒప్పుకున్న కేటీఆర్

    KTR : వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనే...

    Amma App : మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్

    Amma App : మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...

    Gutha Amith Reddy : కాంగ్రెస్ పార్టీలో  చేరిన గుత్తా అమిత్ రెడ్డి

    Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో...

    KCR : జగన్ మళ్లీ గెలుస్తారు: కేసీఆర్

    KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం...

    Etela Rajender : ఈటల రాజేందర్ ఆస్తి రూ.54.01 కోట్లు

    Etela Rajender : మాజీ మంత్రి, ప్రస్తుత మల్కాజిగిరి బీజెపి ఎంపి...