37 C
India
Friday, May 17, 2024
More

    Salaar Collections : ఇప్పటివరకు ‘సలార్’ వసూళ్లు ఎంతో తెలుసా?

    Date:

    Salaar Collections
    Salaar Collections

    Salaar Collections : తెలుగు సినిమా ‘ఈశ్వర్’తో సినీ ప్రయాణం మొదలుపెట్టినా ప్రభాస్.. ప్రస్తుతం ‘సలార్’గా పాన్ ఇండియన్ లెవల్లో సత్తా చాటుతున్నాడు. బహుబలి ఘన విజయాల తర్వాత సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ వంటి పరాజయాలు వచ్చినా ఆయన క్రేజ్ రవ్వంతైనా తగ్గలేదు. ప్లాప్ గా నిలచినా.. ఒక్కొక్కటి 200కోట్లకు పైగానే వసూలు చేశాయి. ఇక వాటి తర్వాత వచ్చిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ‘సలార్’ రికార్డుల మోత మోగిస్తోంది. ప్రభాస్ వన్ మేన్ క్రేజ్ తో వచ్చిన ఈ మూవీలో నటించిన  శ్రియారెడ్డి, పృథ్వీరాజ్ లకు సైతం మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

    విడుదలై 8 రోజులైనా సలార్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా నిన్నటి వరకు రూ.556.84 కోట్లు వసూలు చేసింది. ఇక రేపు, ఎల్లుండి వరుస సెలవులు ఉండడంతో కలెక్షన్లు భారీగానే రాబట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

    బాలీవుడ్ పరంగా చూస్తే షారుఖ్ ‘డంకీ’ ఆకట్టుకోకపోవడం, ఇతర ఏ పెద్ద సినిమాలు బరిలో లేకపోవడం కూడా ఉత్తరాదిన సలార్ కలిసివస్తోంది. ఇక తెలుగులోనూ సంక్రాంతి దాక పెద్ద సినిమాలు లేకపోవడంతో సలార్ కలెక్షన్లు పుంజుకునే అవకాశం ఉంది. తెలుగులో డెవిల్, బబుల్ గమ్ వంటి సినిమాలు వచ్చిన అవి సలార్ పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. దీంతో లాంగ్ రన్ లో సలార్ రూ.1000కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    అయితే సినిమా రిలీజై ఇప్పటికే 8 రోజులు దాటుతుండడంతో ఆ మేనియా కాస్త తగ్గే అవకాశం కనపడుతోంది. రిపీట్ ఆడియన్స్ ఏమేరకు వస్తారు.. కొత్త ఆడియన్స్ ఎంత వరకూ చూస్తారనేదే ప్రధానం.

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    Salaar Collections : తగ్గుతున్న సలార్ కలెక్షన్లు.. రీజన్ ఇదే!

    Salaar Collections : తెలుగు సినిమా ‘ఈశ్వర్’ సినీ ప్రయాణం మొదలుపెట్టినా...

    South Vs North Movies : మనం హిట్లు కొడ్తున్నామని.. వారిని తక్కువ అంచనా వేస్తామా?

    South Vs North Movies : ఇండియాలో సౌత్ సినిమాల హవా...

    Prabhas Salaar : మరో రికార్డు.. దీంతో ఫస్ట్ ప్లేస్ లోకి ప్రభాస్! 

    Prabhas Salaar : ‘ప్రభాస్’ ఈ పేరు ఇండియానే కాదు.. ఓవర్సీస్...