38.3 C
India
Thursday, May 2, 2024
More

    Salaar Collections : తగ్గుతున్న సలార్ కలెక్షన్లు.. రీజన్ ఇదే!

    Date:

    Salaar Collections
    Salaar Collections

    Salaar Collections : తెలుగు సినిమా ‘ఈశ్వర్’ సినీ ప్రయాణం మొదలుపెట్టినా ప్రభాస్.. ప్రస్తుతం ‘సలార్’గా పాన్ ఇండియన్ లెవల్లో సత్తా చాటుతున్నాడు. బహుబలి ఘన విజయాల తర్వాత సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ వంటి పరాజయాలు వచ్చినా ఆయన క్రేజ్ రవ్వంతైనా తగ్గలేదు. ప్లాప్ గా నిలచినా.. ఒక్కొక్కటి 200కోట్లకు పైగానే వసూలు చేశాయి. ఇక వాటి తర్వాత వచ్చిన ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ‘సలార్’ రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే రూ.500కోట్ల కలెక్షన్ల రికార్డును అధిగమించింది. త్వరత్వరగా రూ.1000కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు పెడుతోంది.

    అయితే సలార్ కలెక్షన్లు కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. వరుసగా వర్కింగ్ డేస్ కావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. వీకెండ్ లో మళ్లీ కలెక్షన్లు పుంజుకునే అవకాశం కనపడుతోంది. సంక్రాంతి దాక పెద్ద సినిమాలేవి లేకపోవడం కూడా సలార్ కలిసిరానుంది. తెలుగులో డెవిల్ వంటి సినిమాలు వచ్చిన సలార్ పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. అలాగే హిందీలోనూ భారీ మూవీస్ కనపడడం లేదు. దీంతో లాంగ్ రన్ లో సలార్ రూ.1000కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమి కాదు.

    ఈ మూవీ గనుక 1000కోట్లు రాబడితే ప్రశాంత్ నీల్ రికార్డులు తిరగరాయనున్నాడు. వరుసగా రెండు సినిమాలతో 1000కోట్లు సాధించిన దర్శకుడిగా రాజమౌళి సరసన చేరతాడు. దీంతో ప్రశాంత్ నీల్ హవా పాన్ ఇండియన్ లెవల్లో నడువనుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు ఆయన అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. పలువురు పెద్ద హీరోలు ఆయనతో సినిమా చేయాలని తహతహలాడుతున్నారు. నేటి దర్శకుల్లో సౌత్ నుంచి రాజమౌళి తర్వాత అంతటి క్రేజ్ ను నీల్ సొంతం చేసుకున్నారు.

    బహుబలి నుంచి ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా లెవల్ లోనే ఉంటోంది. ఆయన సినిమాలన్నీ పాన్ ఇండియన్ రేంజ్ లోనే వస్తున్నాయి. హిట్ అయితే 1000కోట్లు, ప్లాప్ అయితే 200 కోట్లు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. సలార్ తో తన క్రేజ్ ను మరింత పెంచేసుకున్న ప్రభాస్.. రాబోయే ప్రాజెక్టు కే, సందీప్ వంగా మూవీ, మారుతి సినిమాలతో ఫ్యాన్స్ ను అలరించనున్నాడు. మరి అవి బహుబలి, సలార్  అవుతాయా..? సాహో, రాధేశ్యాం అవుతాయా? వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Friend : ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: ప్రభాస్ ఫ్రెండ్ డెడికేషన్ ఇది..

    Prabhas Friend : ‘సలార్’లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...

    Salaar Collections : ఇప్పటివరకు ‘సలార్’ వసూళ్లు ఎంతో తెలుసా?

    Salaar Collections : తెలుగు సినిమా ‘ఈశ్వర్’తో సినీ ప్రయాణం మొదలుపెట్టినా...