28 C
India
Friday, May 17, 2024
More

    Chandrababu,Jagan: వక్రబుద్ధి చంద్రబాబుది..నిరుపేదలకు వరం జగన్ సహాయనిధి!

    Date:

     

    ఏపి: వైసిపి ప్రభుత్వం ప్రజలకు  చేకూర్చిన లబ్ధిని  వివరిస్తూ ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా గడప గడపకు “మీ అవినాష్ అన్న హామీ”  అనే కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యలు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పర్యటిస్తున్నారు. 3వ డివిజన్,,కామినేని నగర్,గణేష్ నగర్ ప్రాంతాలలో దేవినేని సుధీర,12వ డివిజన్, శివాజీ రోడ్ ప్రాంతాలలో దేవినేని క్రాంతి,14వ డివిజన్,నల్లూరి సత్యనారాయణ నగర్ ప్రాంతాలలో వై.సిద్దార్థ గార్లు గడప గడపకి వెళ్లి ఈ నాలుగున్నర ఏళ్లలో వై.య స్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించడం జరిగింది.

    ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎవరు చేయనివిధంగా దాదాపు 2లక్షల 70వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి ఖర్చు చేసి 95 శాతం పైగా హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని స్వయంగా ప్రతిపక్ష టీడీపీ నుండి గెలిచిన ఎంపీ కేశినేని నాని గారు అనడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని అన్నారు. మొదటి నుండి కూడా పార్టీని నమ్ముకొన్న నాయకులను నట్టేట ముంచడం చంద్రబాబు నాయుడు కి అలవాటే అని విమర్శించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనే డబ్బున్న వాళ్లను అందలం ఎక్కిస్తు కుట్రలు పన్నుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నుండి వెళ్లే నాయకులు అందరూ కూడా ప్రజల్లో అభిమానం కోల్పోయిన వారే అని, పార్టీకి బారమైన వారే అని తెలిపారు.

    దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ ద్వారా తోపుడు బండి వితరణ-11-01-2024

    తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ విజయనగర్ కాలనీ కి చెందిన బాబు అద్దె టిఫిన్ బండితో ఇబ్బందులు పడుతున్న స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక దేవినేని అవినాష్  దృష్టుకి తీసుకురాగా గురువారం నాడు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జీవనోపాధి నిమిత్తం 25,000 రూపాయల విలువ గల టిఫిన్ బండిని ట్రస్ట్ వైస్ చైర్మన్ దేవినేని సుధీర, చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక,కో అప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

    నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి:దేవినేని అవినాష్

    రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆర్థిక పరిస్థితులు కారణముగా వైద్యానికి దూరం కాకూడదు అనేదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.శనివారం నాడు గుణదల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో 4వ డివిజన్ కి చెందిన దాసం ఉమామహేశ్వర రాజుకి రూ.7,00,000 19వ డివిజన్ కి చెందిన వరిగొండ సూర్యకళ కి రూ.2,50,000/- 22వ డివిజన్ కి చెందిన కసిరెడ్డి పేరెడ్డి రూ.1,30,000 చెక్కుకు అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంద్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని సేవలు కలిపి బృహత్తరమైన ఆరోగ్య శ్రీ పధకం ప్రవేశపెట్టడం జరిగింది అని,ఈ పధకం కింద మన రాష్ట్రంలో నే కాకుండా, పొరుగు రాష్ట్రాలలో కూడా మెరుగైన వైద్యం చేపించుకోడానికి వీలు కల్పించారు అని తెలిపారు. నిరుపేదల సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ తపన పడే వ్యక్తి జగన్ గారు అని కొనియాడారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...