30.1 C
India
Thursday, May 16, 2024
More

    AP News : మూడు కుటుంబాల్లో విషాదం..

    Date:

    Tragedy in three families
    AP News

    AP News : పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (డెయిరీ సైన్స్‌) చదువుతున్న విద్యార్థుల్లో ఓ 18 మంది విహార యాత్ర కోసం శుక్రవారం రాత్రి చెన్నై సమీపంలోని మహాబలిపురానికి వెళ్లారు. శనివారం ఉదయం పర్యాటక ప్రదేశాలను చూస్తూ సరదాగా గడిపారు. తర్వాత అక్కడున్న బీచ్‌లోకి సంతోషంగా దిగారు. వీరిలో మౌనిష్‌ (19), విజయ్‌ కుమార్‌(19), ప్రభు (18) గల్లంతయ్యారు. విజయ్‌ కుమార్‌ మృతదేహం మాత్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఈ దుర్ఘటన.. మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.

    -మూడు నెలల్లో బిడ్డల చదువు పూర్తవుతుంది.

    – విజయ్‌కుమార్‌, మౌనిష్‌ తల్లిదండ్రులు

    విజయ్‌కుమార్‌, మౌనిష్ లది గారుపాళ్యం మండ లంలోని నలగాంపల్లె పంచాయతీ కేసీ కండ్రిగ గ్రామం. విజయ్‌కుమార్‌ తల్లిదండ్రులు లత, తుల సీరామ్‌. మౌనిష్‌ తల్లిదండ్రులు రామాంజలి, చంద్రబాబు. వీరికి విషయం తెలియడంతో బోరున విలపిస్తున్నారు. గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. మూడు నెలల్లో తమ బిడ్డల చదువు పూర్తవుతుందని, ఈ సమయంలో ఇలా జరిగిందని తల్లిదండ్రులు వాపోయారు.

    మనవడి కోసం..

    ప్రభు.. సదుం మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ పెడకంటివారిపల్లెకు చెందిన శివరాణి కుమారుడు. పులిచెర్ల మండలానికి చెందిన శ్రీనివా్‌సతో శివరాణికి వివాహమైంది. భర్త చనిపోవడంతో పదేళ్లుగా పుట్టింట్లోనే కుమార్తె, కుమారుడితో శివరాణి ఉంటున్నారు. విషయం తెలియడంతో ప్రభు అమ్మమ్మ సిద్ధమ్మను ఓదార్చడం ఎవ్వరి తరమూ కావడం లేదు. పల్లెలోనూ విషాదఛాయలు నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Bhuvaneshwari : కురుక్షేత్రానికి సిద్ధమా? నారా భువనేశ్వరి పిలుపు

    Nara Bhuvaneshwari : మే 13న జరగబోయే కురుక్షేత్రానికి మీరు సిద్దమా.....

    Bhuvaneshwari Special worship : నారావారి పల్లెలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు

    Bhuvaneshwari Special Worship : నారావారిపల్లెలో గంగమ్మ దేవత, నాగాలమ్మ దేవతకు...