38.6 C
India
Saturday, May 4, 2024
More

    Bhuvaneshwari Special worship : నారావారి పల్లెలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు

    Date:

    Bhuvaneshwari Special worship

    Bhuvaneshwari Special Worship : నారావారిపల్లెలో గంగమ్మ దేవత, నాగాలమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి గారు. అనంతరం అత్తమామలు కర్జూర నాయుడు, అమ్మణమ్మ  సమాధుల వద్ద నివాళులు అర్పించారు. నారావారిపల్లిలో గ్రామస్థులు, మహిళలు భువనేశ్వరిని కలిశారు. చంద్రబాబు అరెస్ట్ పై ఆవేదన వ్యక్తం చేసిన వారు….త్వరలో మంచి జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని భువనేశ్వరి కి సూచించారు.

    చంద్రబాబు నాయుడు స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారి పల్లె. చంద్రబాబు అరెస్టు తరువాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ నారా భువనేశ్వరి గ్రామదేవతలైన నాగులమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఆందోళనల సందర్భంలో భువనేశ్వరి పూజలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

    నారావారి పల్లెలో బాబు కోసం పూజలు నిర్వహించారు. బాబు అమ్మానాన్నలు కర్జూర నాయుడు, అమ్మణమ్మ సమాధులను దర్శించుకుని నివాళులర్పించారు. తమను చల్లగా చూడాలని వేడుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. నారావారి పల్లెలో పూజలు చేయడంతో గ్రామస్తులు తరలి వచ్చారు. బాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.

    నారావారి పల్లె నుంచి సీఎం ఎదిగిన బాబును ప్రస్తుతం కష్టాల్లో పడేశారు. జైల్లో పెట్టారు. అకారణంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత కక్షలతో లేనిపోని నేరాలు ఆపాదించి అరెస్టు చేయడం అన్యాయమని విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబును కుట్రలతో బలి చేస్తున్నారు. భువనేశ్వరి రావడంతో గ్రామస్తులు అంతా సందడి చేశారు. గ్రామదేవతలతో పాటు అత్తా మావయ్య సమాధులను దర్శించి మొక్కు తీర్చుకున్నారు. భువనేశ్వరి వచ్చిన సందర్భంగా వచ్చిన ప్రజలతో మనస్ఫూర్తిగా మాట్లాడారు.

    Share post:

    More like this
    Related

    Kannappa : కన్నప్పలో నందీశ్వరుడి ఆగమనం ఎప్పుడు

    Kannappa : టాలీవుడ్ హీరో  మంచు విష్ణు  కలల ప్రాజెక్టు కన్నప్ప....

    Sharmila : సీఎం జగన్ కు.. షర్మిల ‘నవ సందేహాలు’

    Sharmila : ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్ కు ఏపీ...

    Crime News : చెల్లి ప్రేమపెళ్లి ఇష్టం లేక.. బావ హత్య

    Crime News : తమ చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం...

    Hansika : హన్సిక హర్రర్ మూవీల టెర్రర్

    Hansika : తెలుగులో బబ్లీ గర్ల్ గా పేరొందిన హన్సిక మెత్వానీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharmila : సీఎం జగన్ కు.. షర్మిల ‘నవ సందేహాలు’

    Sharmila : ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్ కు ఏపీ...

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    AP News : ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్లు – సీజ్ చేసిన పోలీసులు

    AP News : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40...