37.7 C
India
Saturday, May 18, 2024
More

    Kannappa : కన్నప్పలో నందీశ్వరుడి ఆగమనం ఎప్పుడు

    Date:

    Kannappa
    Kannappa

    Kannappa : టాలీవుడ్ హీరో  మంచు విష్ణు  కలల ప్రాజెక్టు కన్నప్ప. కొన్నేళ్లుగా ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. సౌత్ తో పాటు బాలీవుడ్  హీరోలను సైతం ఈ సినిమాలో తీసుకున్నాడు.  కొన్ని నెలల క్రితం షూటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటికే రెండు షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాయి. ఖర్చుకు వెనకాడకుంటా భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    భక్త కన్నప్పను మరిపించేలా?

    సీనియర్ నటుడు, దివంగత కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. టాలీవుడ్లో ఒకే కథతో ఎన్నో చిత్రాలు తీసి హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే కన్నప్ప సినిమా విషయంలో మాత్రం మరెవరూ ఈ మూవీని రీమేక్ చేయడానికి సాహసించడం లేదు. అంతలా ఒదిగిపోయాడు కృష్ణంరాజు.  అయితే ఈ సినిమాపై మక్కువ పెంచుకున్నాడు మంచు విష్ణు. ఇప్పుడున్న సాంకేతికతతో ఆ సినిమా మరిపించేలా కన్నప్ప సినిమా చేస్తానని చెబుతున్నాడు.  ఈ సినిమాకు హాలీవుడ్ సాంకేతిక నిఫుణులను పని  చేస్తున్నారు. షూటింగ్ సైతం విదేశాల్లో చేస్తున్నారు.ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ కూడా విదేశాల్లోనే చేశారు.

    శివుడు వెళ్లాడు.. ఇక నంది మిగిలాడు..

    కన్నప్ప లో ముందుగా శివుడి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ చేయబోతున్నాడని టాక్ వినిపించింది. ప్రభాస్ అభిమానులైతే ఏకంగా కన్నప్పలో ప్రభాస్ లుక్ ఇదేనంటూ శివుడి గెటప్ లో ఉన్న పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఇక కన్నప్పలో ప్రభాస్ శివుడిగా చేస్తున్నాడని అందరూ ఫిక్స్ అయ్యారు. మూవీ షూటింగ్ కూడా మొదలవడంతో ప్రభాస్ ఈ సినిమాకు కాల్షీట్లు ఇచ్చాడని, సెట్లో అడుగు పెట్టబోతున్నాడని రూమర్లు వచ్చాయి. కానీ అనూహ్యంగా శివుడి క్యారెక్టర్ ను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేశారు.

    దాదాపు రెండు వారాల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో అక్షయ్ తో షూటింగ్ కూడా చేశారు.  రెండు రోజుల క్రితం అక్షయ్ కుమార్ కు సంబంధించి పార్ట్ కూడా పూర్తయ్యింది. ఆ విషయాన్ని హీరో, నిర్మాత మంచు విష్ణు, అక్షయ్ కుమార్ వెల్లడించారు. మరి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో తనకు శివుడి రోల్ వద్దని, వేరే ఏ రోల్ ఇచ్చినా చేస్తానని ప్రభాస్ చెప్పడంతో ఆయనకు కీలకమైన నందీశ్వరుడి క్యారెక్టర్ ఇచ్చారని ఇటీవల ఫిలిం ఇండస్ర్టీలో టాక్ నడిచింది. అక్షయ్ షూటింగ్ పార్ట్ అయిపోవడంతో శివుడు వెళ్లాడు.. మరి నందీశ్వరుడి ఎంట్రీ ఎప్పుడనే చర్చ నడుస్తున్నది. మరి ప్రభాస్ కన్నప్ప సెట్లోకి ఎంట్రీ ఎప్పుడిస్తాడో వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Manchu Vishnu Kannappa : కన్నప్ప గురించి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్

    Manchu Vishnu Kannappa : టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం...

    Kannappa Movie : కన్నప్ప కోసం 8 కంటైనర్లను విదేశానికి తరలింపు..!

    Kannappa Movie : తెలుగు సినిమాల్లో మోహన్ బాబు తర్వాత ఆయన వారసులు...