Kannappa Movie : తెలుగు సినిమాల్లో మోహన్ బాబు తర్వాత ఆయన వారసులు కూడా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.. వారిలో మంచు విష్ణు ఒకరు.. ఈయన ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఇప్పటికి స్టార్ హీరో కాలేక పోయారు.. ఈయన కెరీర్ లో ఒకటి రెండు హిట్స్ మినహ పెద్దగా చెప్పుకునేంత సినిమాలు లేవు..
ఇక విష్ణు గత ఏడాది జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ నే మూట గట్టుకుంది. దీంతో ఈయన గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.. అయితే తాజాగా ఈయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసాడు. ఎన్నో ఏళ్ల నుండి విష్ణు కన్నప్ప అనే సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నాడు.
కానీ ఇది వాయిదా పడుతూనే ఉంది. మరి ఎట్టకేలకు ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసి షూట్ స్టార్ట్ చేసారు. ఈ సినిమాలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో మంచు విష్ణు పరమేశ్వరుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రలో నటిస్తున్నాడు.
మహాభారతం టెలివిజన్ సిరీస్ దర్శకుల్లో ఒకరైన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది టీమ్.. ఈ సినిమా షూట్ మొత్తం న్యూజిల్యాండ్ లో సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేయనున్నట్టు టాక్.. అందుకే భారీ సెట్స్, ఇతర సామాగ్రి మొత్తం అవసరం కాబట్టి ఇందుకోసం 5 నెలలుగా 800 మంది సిబ్బంది కష్టపడుతున్నట్టు మేకర్స్ తెలిపారు.
సెట్స్ కు సంబంధించిన సామగ్రితో పాటు ఆయుధాలు కూడా 8 భారీ కంటైనర్లలో న్యూజీల్యాం కు సముద్రమార్గం ద్వారా తరలించినట్టు తెలుస్తుంది. ఒక వీడియో ద్వారా ఐ ఇవన్నీ చూపించారు. సెట్ కు సంబంధించిన సామాగ్రి, సెట్ కోసం వస్తువులు, ఆయుధాలు అన్ని కూడా అందరిని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. మరి ఈ ప్లానింగ్ తో తెరకెక్కనున్న ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి..