
Mohan Babu Family : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను తెలుగు చిత్ర పరిశ్రమ పట్టించుకోవడం లేదా.. ఆయన మాటకు గౌరవం ఇవ్వడం లేదా . అసలు ఈయన ఊసే ఎత్తడం లేదా.. మోహన్ బాబు అంటూ ఒకరు ఉన్నారని మరచిపోయరా ..అంటే అవుననే చెప్పాలి. వందలచిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలై హీరోగా, నిర్మాతగా మోహన్ బాబు టాలీవుడ్ లో చెరగని ముద్ర వేశారు. హీరోగా … విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించి మెప్పించాడు.
సినిమా ఇండస్ట్రిలో తనకంగూ ఓ ప్రత్యేక గౌరవం ఉండేది . ముక్కుసూటి గా మాట్టాడుతూ ఎవరకి భయపడని వ్యక్తి తనకు ఏమనిపిస్తే అది మాట్లాడుతూ, అవతలి వ్యక్తి ఎంత పెద్దవాడైనా ఎవరైనా సరే మోహన్ బాబు అస్సలు భయపడడు అందుకే చాలామంది ఈయనతో మాట్లాడాలంటే భయపడుతుంటారు.. అలాంటి ఈయన్ను ఇప్పుడు ఇండస్ట్రీ పట్టించుకోకపోవడం అభిమానులను బాధపెడుతోంది.
గత కొంత కాలంగా మోహన్ బాబు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు .హీరోగా నటించే పరిస్థితి లేదు క్యారెక్టర్ ఆర్టిస్లుగా చేయాలని ఆసక్తి ఉన్నా కూడా ఏ హీరో కూడా తన సినిమాలో తీసుకోవడంల లేదు చిన్నా చితకా దర్శకులు మోహన్ బాబు వద్దకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు పెద్ద సినిమల్లో చాన్స్ లు లేక చిన్న సినిమాల్లో నటించే పరిస్థితి రాక మోహన్ బాబు చాలా బాధపడుతున్నట్లు తెలుస్తుంది.
మరోపక్క మోహన్ బాబు ఫ్యామిలి నుండి హీరోలుగా వచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ కు ప్రస్తుతం అవకాశాలు లేకుండా పోయాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలంతా చిత్ర సినిమా లో వెలిగి పోతుంటే మనోజ్ విష్ణు లు మాత్రం అవకాశాలు లేకుండా ఖాళీగా ఉండడం కూడా మోహన్ బాబును కలవరపెడుతోంది. మొత్తం మీద మోహన్ బాబుకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని అంత మాట్లడుకుంటున్నారు.