34 C
India
Tuesday, May 21, 2024
More

    రవితేజ మాస్ ఎంట్రీ : ఫస్ట్ లుక్ కేక

    Date:

    ravi teja first look out from Waltair Veerayya
    ravi teja first look out from Waltair Veerayya

    మాస్ మహారాజ్ రవితేజ మాస్ ఎంట్రీతో కేక పెట్టించాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ” వాల్తేరు వీరయ్య ”. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2023 లో సంక్రాంతి కానుకగా జనవరి 13 న వాల్తేరు వీరయ్య చిత్రం విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా కీలక పాత్రలో రవితేజ కూడా నటిస్తున్నాడు.

    ఈ చిత్రంలో ACP విక్రమ్ సాగర్ గా నటిస్తున్నాడు రవితేజ. దాంతో ఈరోజు రవితేజ ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్నాడు. ఒక చేతిలో మేక పిల్లను పట్టుకొని మరో చేత్తో గొడ్డలి పట్టుకొని ఉన్నాడు రవితేజ. అతడి ముందు గ్యాస్ సిలిండర్ పేలడానికి సిద్ధంగా ఉంది. ఈ పవర్ ఫుల్ స్టిల్ ను మేకర్స్ విడుదల చేసారు. రవితేజ మాస్ లుక్ కు సోషల్ మీడియాలో అప్పుడే విపరీతమైన స్పందన వస్తోంది.

    ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రవితేజ లుక్ పై ట్వీట్ చేసి మరింత వైరల్ అయ్యేలా చేసాడు. ఊర మాస్ కు కేరాఫ్ అడ్రస్ అయిన చిరంజీవి అంటే ఇప్పుడున్న హీరోలకు అందరికీ అభిమానమే ! ఇక మాస్ మహారాజ్ రవితేజకు ప్రాణం. అలాంటి అన్నయ్య సినిమాలో చిన్న పాత్ర లభించినా చాలు అనుకునే రవితేజకు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ దక్కడంతో సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ సంక్రాంతికి థియేటర్ లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి శృతి హాసన్ తో సయ్యాట ఆడుతున్నాడు యూరప్ లో …… అంటే పాటల చిత్రీకరణ జరుగుతోంది అదన్న మాట సంగతి. సరిగ్గా వాల్తేరు వీరయ్య హంగామాకు నెల రోజుల సమయం ఉంది…….గెట్  రెడీ మెగా ఫ్యాన్స్.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...