31 C
India
Thursday, May 16, 2024
More

    Dance Effect : డాన్స్ ఎఫెక్ట్.. ఎస్ఐ సహా 8 మందిపై వేటు..

    Date:

    Dance Effect
    Dance Effect

    Dance Effect : భూపాల‌ప‌ల్లి జిల్లా, మ‌హ‌దేవ్‌పూర్ జ‌డ్పీటీసీ గుడాల అరుణ భ‌ర్త శ్రీనివాస్ సోమ‌వారం (ఏప్రిల్ 15) ఉద‌యం పోలీస్ స్టేష‌న్‌లో స్టెప్పులు వేసిన వీడియో వైర‌ల్‌గా మారింది. హీరో నాగార్జున నటించిన ‘నేనున్నాను’ సినిమాలోని ‘ని కోసం ని కోసం.. నీ కోసం..’ పాట‌కు పోలీస్ స్టేష‌న్‌లో డాన్స్ చేస్తుండ‌గా, స్టేష‌న్‌ కానిస్టేబుళ్లు ఎంక‌రేజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. పోలీస్ స్టేష‌నా డాన్స్ క్లబ్బా? అంటూ నెటిజ‌న్లు ఫైర్ అయ్యారు. దీనిపై పోలీస్‌ శాఖ కూడా తీవ్రంగా స్పందించింది.

    శ్రీనివాస్ ఉద‌యం వాకింగ్ కు వెళ్లి వ‌స్తూ నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి అక్కడ ఉన్న కానిస్టేబుళ్లను పలకరించారు. ఇటీవ‌ల శ్రీనివాస్ ఒక చోట డాన్స్ చేసింది చూసిన పోలీసులు మీరు బాగా డాన్స్ చేస్తారంటూ ఎంకరేజ్ చేస్తూ మొబైల్ లో ఓ పాట‌ను ప్లే చేశారట. ఇంకేముంది శ్రీనివాస్ డాన్స్ షురూ చేసిండు. డాన్స్ చేసినా ఎక్సర్ సైజ్ అవుతుందని చెప్పాడు శ్రీనివాస్.

    ఈ ఘటనను పోలీస్ బాసులు సీరియస్ గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ కిరణ్ కరే విచారణ చేయించారు. బాధ్యులైన ఎస్ఐతో పాటు మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఆరుగురు పోలీస్ కానిస్టేబుళ్లపై వేటు వేశారు. క్రమ శిక్షణ చర్యల్లో భగంగా వీరిపై వేటు వేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మహదేవ్ పూర్ ఎస్ఐ ప్రసాద్ ను వీఆర్ జిల్లా కేంద్రానికి బదిలీ చేయగా.. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. మరో హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్ ను ఘన్పూర్ పీఎస్ కు, ఆరుగురు కానిస్టేబుళ్లు ధనుంజయను మొగుళ్లపల్లికి, విక్రాంత్ ను కాటారంకు, నాగరాజును మహదేవ్ పూర్ కు అరుణ్ కుమార్ ను రేగొండకు, కిరణ్ ను చిట్యాలకు, తిరుపతిని కొయ్యూరుకు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమ శిక్షణ తప్పితే సహించేది లేదని ఎస్పీ కిరణ్ కరే హెచ్చరించారు. ఇంత పెద్ద ఎత్తున క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BhupalaPally : బాలికపై సీఐ అత్యాచారం..

    BhupalaPally : తెలంగాణ: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే 16 ఏళ్ల...