30.8 C
India
Friday, May 17, 2024
More

    60 ఏళ్ళు పూర్తి చేసుకున్న శ్రీకృష్ణార్జున యుద్ధము

    Date:

    sri krishnarjuna yuddamu completes 60 years
    sri krishnarjuna yuddamu completes 60 years

    మహానటులు నందమూరి తారకరామారావు , అక్కినేని నాగేశ్వర్ రావు కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం ” శ్రీ కృష్ణార్జున యుద్ధము ”. కెవి రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జయంతి పిక్చర్స్ పై నిర్మించారు. 1963 జనవరి 9 న ఈ చిత్రం విడుదలై ఆంధ్రదేశమంతటా అఖండ విజయం సాధించింది. పెండ్యాల నాగేశ్వర్ రావు సంగీతం అందించగా పింగళి సాహిత్యం అందించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన 10 పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

    శ్రీకృష్ణుడుగా నందమూరి తారకరామారావు నటించగా అర్జునుడిగా అక్కినేని నాగేశ్వర్ రావు నటించారు. ఇక కీలక పాత్రల్లో బి. సరోజాదేవి , గుమ్మడి , మిక్కిలినేని , కాంతారావు , ధూళిపాళ , వి. నాగయ్య , ముక్కామల , సత్యనారాయణ , ప్రభాకర్ రెడ్డి , అల్లు రామలింగయ్య , చదలవాడ , వరలక్ష్మీ , మహంకాళి వెంకయ్య , శ్రీరంజని ,ఛాయాదేవి , సురభి బాలసరస్వతి తదితరులు నటించారు.

    ” అన్నీ మంచి శకునములే ” , ” అలిగితివా సఖి ”, ” మనసు పరిమళించెనే ” , ” దేవ దేవ నారాయణ ”, ” చాలదా ఈ పూజ దేవి ” , ”నీకై వేచితినయ్యా ” , ” స్వాముల సేవకు వేళాయె ” , ” తపము ఫలించిన శుభవేళ ”, ” వేయి శుభములు కలుగు నీకు ” వంటి పాటలు బహుళ జనాదరణ పొందాయి.

    ఎన్టీఆర్ శ్రీకృష్ణుడుగా నటించగా అర్జునుడుగా అక్కినేని నటించడం విశేషం. ఈ ఇద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అలాగే పోరాట సన్నివేషాలు కూడా ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠ కు గురి చేసాయి. ఇద్దరు కూడా పెద్ద హీరోలు కావడంతో నందమూరి – అక్కినేని అభిమానుల మధ్య తీవ్ర పోటీ ఉండేది. శ్రీకృష్ణార్జున యుద్ధము చిత్రం విడుదలై సరిగ్గా 60 ఏళ్ళు దాటింది. దాంతో అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు అభిమానులు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sr. NTR Lava Kusa Movie : “లవకుశ” సెన్సేషనల్ రికార్డ్స్..!

    Lava Kusa 1963 : నందమూరి తారకరామారావు గారు శ్రీరాముడు గా...

    Annapurna Pictures : అన్నపూర్ణా పిక్చర్స్ అంటే..అది అక్కినేని సంస్థ అనే అనుకుంటారు. కానీ..! 

    Annapurna Pictures : కానీ అది అక్కినేని భార్య అన్నపూర్ణ గారి...

    నాటు నాటు డ్యాన్స్ కు ఎన్టీఆర్ – అక్కినేని డ్యాన్స్ అదరహో

    ఇప్పుడు ఎక్కడ చూడు నాటు నాటు పాట ...... అలాగే ఆ...

    ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త : మళ్లీ విడుదల అవుతున్న ఆది

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. ఆది చిత్రాన్ని మళ్లీ విడుదల...