37.7 C
India
Saturday, April 27, 2024
More

    Annapurna Pictures : అన్నపూర్ణా పిక్చర్స్ అంటే..అది అక్కినేని సంస్థ అనే అనుకుంటారు. కానీ..! 

    Date:

    Annapurna Pictures
    Annapurna Pictures

    Annapurna Pictures : కానీ అది అక్కినేని భార్య అన్నపూర్ణ గారి పేరు కాదు.దుక్కిపాటి మధుసూధనరావు గారి సవతి తల్లి పేరు. కన్న తల్లి చనిపోతే..తల్లి కంటే మిన్నగా పెంచిన సవతి తల్లి పేరన మధుసూదన రావు  స్థాపించిన సంస్థ అది. అక్కినేని  ని చైర్మన్ చేసి భాగస్వామ్యం ఇచ్చారు.

    వీరిది చిరకాల స్నేహం.

    గుడివాడ దగ్గర పెయ్యేరు లో పుట్టిన మధుసూదన రావు..మచిలీపట్నం లోని నోబుల్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చేస్తూ..నాటకాలవీ వేస్తూ..ఎక్సెల్షియర్ నాటక సంస్థ స్థాపించారు.

    అందులో సభ్యులలో పెండ్యాల,

    ఆత్రేయ,  బుధ్ధరాజు & అక్కినేని ఉండేవారు.

    అప్పటికే 1941 లో చిన్న రోల్ ధర్మపత్ని లో పోషించి వెనక్కి వచ్చేసి… నాటకాల్లో స్త్రీ పాత్రలే సుకుంటూ ఉన్న అక్కినేనికి…1944 లో ఘంట సాల బలరామయ్య సీతారామ జననం తో బ్రేక్ ఇచ్చారు.

    అప్పటి నుండి అక్కినేనికి వెన్ను – దన్ను గా నిలిచింది మధుసూదనరావే అక్కినేని తోనే అన్ని సినిమాలూ తీశారని చెప్పాలి.మంచి కథకుడు కూడా. స్క్రీన్ ప్లే డెవలప్ చేయడంలో సిధ్ధ హస్తుడు.

    అన్నపూర్ణ సంస్థ ద్వారా తొలిసారి దొంగరాముడు (1955) చిత్రం నిర్మించారు. అఖండ విజయం సాధించింది.

    తోడికోడళ్ళు (1957), మాంగల్యబలం (1958), వెలుగునీడలు (1961), ఇద్దరు మిత్రులు (1961), చదువుకున్న అమ్మాయిలు (1963), డాక్టర్‌ చక్రవర్తి (1964), ఆత్మ గౌరవం (1966), పూలరంగడు (1967), విచిత్రబంధం (1972), ప్రేమలేఖలు (1977), రాధాకృష్ణ (1978), పెళ్లీడు పిల్లలు (1982), అమెరికా అబ్బాయి (1987) వంటి అద్భుతమైన చిత్రాలెన్నో దుక్కిపాటి నిర్మించారు.

    నిర్మాతలకు అభిరుచంటూ ఒకటి ఉండాలి కదా. అది మెండుగా ఉన్న వ్యక్తి దుక్కిపాటి.మన కాశీనాథుని విశ్వనాథ్ కు మొదట దర్శకత్వం నెరపే ఛాన్స్ ఇచ్చిందీ ఆయనే..

    ఆత్మ గౌరవం (1966)తో వీణ పాటలు..అన్నపూర్ణా సంస్థ లో ప్రత్యేకంగా ఉండేవి.

    పాడవేల రాదికా..

    పాడెద నీ నామమే గోపాల..

    పాడమని నన్నడగ తగునా..

    నీవు రావు నిదుర రాదు..(సితార అనుకోండి)..

    మదిలో వీణలు మ్రోగె..

    ఇవన్నీ కూడా సుశీల గారి స్వరాన తేనె లొలికాయి మధురాతి మధురంగా.

    అన్నపూర్ణా సంస్థ అంటే..అంత మక్కువ ఉండేది ప్రేక్షకులకు & నటీ నటులకు కూడ.

    సూర్యకాంతమ్మ ప్రతి దీపావళికి మధుసూదన రావు ఇంటికి వెళ్ళి ఆయన చేత్తో వంద రూపాయలు తీసుకునేదట. అది ఆమెగారి సెంటిమెంటు.

    ఏమిటి ఈ సారి నాకు రోల్ ఇవ్వలేదు!?… అంటూ అడిగారు సావిత్రి…ఇద్దరు మిత్రులు తీస్తున్నప్పుడు ఆయన్ని.

    మీ రేంజి పాత్ర ఈ మూవీలో లేదమ్మా.

    ఉంటే మీరు కాక ఇంకెవరు నామొదటి ఛాయిస్ చెప్పమ్మా..అన్నారటాయన.

    డాక్టర్‌ చక్రవర్తి చిత్రం రాష్ట్రప్రభుత్వం నెలకొల్పిన తొలి నంది అవార్డును అందుకోవడం విశేషం.

    జాతీయ అవార్డులు అందుకున్న చిత్రాలు..

    తోడి కోడళ్లు (1957)

    మాంగల్య బలం (1958)

    డాక్టర్ చక్రవర్తి (1964)

    నంది అవార్డులు..

    మొదటి ఉత్తమ చలన చిత్రం – బంగారు నంది – డాక్టర్. చక్రవర్తి.(1964)

    మూడవ ఉత్తమ చలన చిత్రం- కాంస్య- ఆత్మ గౌరవం (1965)

    రెండవ ఉత్తమ చలన చిత్రం – వెండి – ఆత్మీయులు (1969)

    మూడవ ఉత్తమ చరణ చిత్రం- కాంస్య –

    అమాయకురాలు (1971)

    జీవితకాల సాఫల్యానికి రఘుపతి వెంకయ్య అవార్డు – 1993

    పెళ్లీడు పిల్లలు అమెరికా అబ్బాయి తప్ప మిగిలిన చిత్రాలన్నీ ఘన విషయం సాధించాయనడం లో ఎలాంటి సందేహం లేదు..

    తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన మొదటి సినిమా ఇద్దరు మిత్రులు.

    తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి రావడానికి అక్కినేనితోపాటు దుక్కిపాటి మధుసూదనరావు ఎంతో కృషి చేశారని అంటారు.

    ఆపేరు అక్కినేని కి వచ్చినా…దాని వెనుక మూల స్తంభం దుక్కిపాటే నంటారు.

    ఇక అన్నపూర్ణా స్టూడియోస్….ఆ చరిత్రంతా తెలిసిందే.

    స్వంత అన్నదమ్ములు కూడా ఇంతగా కలిసి పోయి పరస్పర సహకారం చేసుకోరు.

    అమలిన స్నేహం కూడా ఓ అదృష్టమనే చెప్పాలి.

    ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా…

    నిర్మాతలు, దర్శకులు, నటులు, సంగీతకారులు, గీత రచయితలు, గాయకులు మొదలైన పరిశ్రమ కోసం పనిచేసిన అనేకమందికి సహాయం చేసారని అంటారు.

    దుక్కిపాటి మధుసూదన రావు గారు న్యుమోనియా వ్యాధితో బాధపడూతూ 90 యేళ్ళ వయసులో 26 మార్చి న, 2006 లో మరణించారు.

    ఈ రోజు  వారి వర్ధంతి.

    స్మృత్యంజలి.

    వారి చిత్రాలలోని 4 పాటల చరణాలు వారికి

    నా స్వర నివాళి.

    అమాయకురాలు..

    నీ మురళీ గానమే పిలిచెరా

    కన్నుల నీమోము కదలెనులేరా

    నీ మురళీగానమే పిలిచెరా

    పొన్నలు పూచే బృందావనిలో

    వెన్నెల కురిసే యమునాతటిపై

    ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

    పొన్నలు పూచే బృందావనిలో

    వెన్నెల కురిసే యమునాతటిపై

    నీ సన్నిధిలో జీవితమంతా ..

    కానుక చేసేను రారా

    పాడెద నీ నామమే గోపాలా

    హృదయములోనే పదిలముగానే

    నిలిపెద నీ రూపమేరా..

    పాడెద నీ నామమే గోపాలా..

    ఆత్మ గౌరవం..

    ఏ పూర్వ బంధమో అనుబంధమాయె

    ఏ పూర్వ బంధమో అనుబంధమాయె

    అపురూప మైన అనురాగ మాయె

    నీ కౌగిటా హాయిగా సోలిపోయి

    నీ కౌగిటా హాయిగా సోలిపోయి

    సరదాల ఉయ్యాల ఉల్లాసం గా వూగాలోయి

    ఒక పూల బాణం తగిలింది మదిలో

    తొలి ప్రేమ దీపం వెలిగింది లే

    నాలో వెలిగింది లే

    తోడి కోడళ్ళు..

    కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చాన

    బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా

    కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చాన

    బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా

    నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే..

    నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే

    వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో

    కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి చాన

    బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా

    ఇద్దరు మిత్రులు..

    అదా కోరికా వయ్యారి కోయిలా

    జగాలే నీ చూపులో జలదిరించెనే

    అదా కోరిక వయ్యారి కోయిల

    జగాలే నీ చూపులో జలదరించెనే

    వరాల నవ్వులే గులాబి పువ్వులై

    వలపు తేనె నాలోన చిలకరించెనే

    ఓహొ ఓహొ నిన్నే కోరెగా

    కుహుకుహూ అని కోయిలా

    వసంతవేళలా పసందు మీరగా

    అపూర్వగానమే ఆలపించే తీయగా

    ఓహొ ఓహొ నిన్నే కోరెగా

    కుహుకుహూ అని కోయిలా

                                          – డాక్టర్. కె.వి.ఎస్. ప్రసాద్.

    Share post:

    More like this
    Related

    Arjun Wife : అల్లు అర్జున్ భార్యను ఏమని పిలుస్తాడు.. ?

    Arjun Wife : అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీతో టాలీవుడ్...

    Reliance Jio : ఓటీటీ రంగంలో సంచలనంగా మారనున్న రిలయన్స్ జియో.. నెలకు రూ. 29కే..

    Reliance Jio : జియో సినిమా కేవలం రూ.29కే నెలవారీ సబ్...

    Kalki Release : కల్కి రిలీజ్ వాయిదా.. ఎప్పుడు విడుదలంటే?

    Kalki Release : కల్కి రిలీజ్ డేట్ మారిందా..  ప్రభాస్ అభిమానులకు...

    Father Killed : కొడుకును చంపిన తండ్రి.. ఆన్ లైన్ గేమ్ లు మానకపోవడంతోనే

    Father Killed Son : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ANR Comments : నాగార్జునకు హీరో అయ్యే లక్షణాలు లేవు.. అప్పట్లో ఏఎన్నార్ కామెంట్స్..!

    ANR Comments : అక్కినేని నాగార్జున గురించి తెలియని వారు లేరు.. నాగ్...

    ANR Statue Inauguration : అక్కినేని నాగేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ.. మహేష్, చరణ్ హాజరు.. ఇంకా ఎవరెవరు వచ్చా

    ANR Statue Inauguration : టాలీవుడ్ లెజెండరీ నటులలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు.....

    Stars of yesteryear : మన తారలు.. వారి అరుదైన మరుపురాని చిత్రాలు.. 

    Stars of yesteryear ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్ లో...

    NTR : దానవీర శూరకర్ణలో కృష్ణుడి పాత్రను ఏఎన్నార్ ఎందుకు చేయనన్నారో తెలుసా?

    NTRఎన్టీఆర్ ఏది తీసినా సంచలనమే. అప్పుడు ఆయన ప్రత్యేకత అలా ఉండేది....