ANR Statue Inauguration :
టాలీవుడ్ లెజెండరీ నటులలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు.. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుని తెలుగు సినీ పరిశ్రమకు చాలా సేవ చేసారు.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను చేసి అగ్ర నటుడుగా ఎదిగిన ఏఎన్నార్ ఈ రోజు 100వ జయంతిని జరుపు కుంటున్నారు. అలంటి దిగ్గజ నటుడు శత జయంతి వేడుకలను అక్కినేని కుటుంబం గ్రాండ్ గా జరిపించారు.
ఈ వేడుకలను ఈ ఏడాది మొత్తం జరప బోతున్నారు.. ఈ ఉత్సవాలను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.. ఈ విగ్రహ ఆవిష్కరణకు చాలా మంది అతిరధ మహారధులు తరలి వచ్చారు.. ఇక విగ్రహ ఆవిష్కరణను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జరిపించారు.
అక్కినేని నాగార్జున, నాగ సుశీల ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్యామిలీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకను ఎంతో గ్రాండ్ గా నిర్వహించగా అతిరధ మహారధులు తరలి వచ్చారు.. అక్కినేని ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ సెలెబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు.. మరి ఎవరెవరు హాజరయ్యారు అంటే..
సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు న్యాచురల్ స్టార్ నాని, మంచు విష్ణు, శ్రీకాంత్, దర్శకధీరుడు రాజమౌళి, బ్రహ్మానందం వంటి అగ్రతారలు తరలి వచ్చారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులూ కూడా విచ్చేసారు. ఈ వేడుకలను ఏడాది మొత్తం నిర్వహించాలని అభిమానులు సిద్ధం అవుతున్నారు. దీంతో ప్రతీ నిత్యం ఎక్కడో ఒక చోట ఈ వేడుకలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు.