38.1 C
India
Sunday, May 19, 2024
More

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Date:

    Pawan Kalyan
    Pawan Kalyan

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.  ఈ సందర్భంలో  తన గురించి, తాను రాజకీయాల్లోకి వచ్చిన ఉద్దేశం గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలు చేసుకుని హాయిగా బ్రతకాల్సిన తను, ప్రజల సమస్యలను చూసి, ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.  పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.  రాజకీయాల్లోకి ఎన్నో విలువలతో వచ్చానని చెప్పుకొచ్చారు పవన్.  గత ఎన్నికలలో ప్రజలు తనను ప్రజలు ఆదరించక పోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాడానన్నారు. ఇక తన క్యారెక్టర్ గురించి చెప్పిన పవన్ అందుకు ఒక చక్కని ఉదాహరణ చెప్పారు.

    పవన్ సినిమాలకే పరిమితమైతే ఆయనకు రూ.100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సైతం నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.  ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ తనకు వచ్చిన ఆఫర్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. గతంలో తాను ఒక కూల్ డ్రింక్ యాడ్ కోసం పని చేశానంటూ చెప్పుకొచ్చారు. ఆ కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగితే షారుఖ్ ఖాన్  కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని తనకు ఆఫర్ చేశారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో దేని నుంచి డబ్బులు సంపాదించాలో దానిపై మాత్రమే దృష్టి పెట్టానన్నారు.

    కొన్ని విలువలు పెట్టుకుని పని చేశానంటూ ఆయన కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో చర్చనీయాంశం అవుతున్నాయి.  పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కంటే విలువలకే ప్రాధాన్యత ఇస్తారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా పవన్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం ఒకింత గందరగోళం నెలకొంది. పవన్ ఎక్కువ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమాలు చెప్పిన తేదీలకు విడుదలవుతాయో లేదో చెప్పలేని పరిస్థితి. అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ రెమ్యూనరేషన్ పరంగా సైతం టాప్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత కొత్త సినిమాలను ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...