38.1 C
India
Sunday, May 19, 2024
More

    Top Heros Remuneration : రెమ్యునరేషన్ విషయంలో టాలీవుడ్ టాప్.. ఎవరికి ఎంతో తెలుసా?

    Date:

    Top Heros Remuneration
    Top Heros Remuneration

    Top Heros Remuneration : ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు టాలీవుడ్ చలన చిత్ర రంగంలో పెను మార్పులు సంభవించాయి. ఇప్పుడు టాలీవుడ్ మూవీ అంటే పాన్ వరల్డ్ స్థాయి అనేలా చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో తెలుగు ఇండస్ట్రీపై ఎక్స్ పర్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. బాహుబలి నుంచి మన సినిమాలు వందల కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి. దీంతో మన స్టార్స్ కు కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ పెరుగుతోంది.

    ఒకప్పుడు టాలీవుడ్ హీరోలకు రెమ్యునరేషన్ రూ. 10 కోట్లు, రూ. 15 కోట్లు అంటే వామ్మో అనేవారు. రాజమౌళి దయతో ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమాలు బాలీవుడ్ నే కలవరానికి గురి చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ అయితే రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు కూడా వసూలు చేస్తున్నాడు.

    టాలీవులో టాప్ 10 హీరోల రెమ్యునరేషన్ చూద్దాం..

    1. ప్రభాస్
    బాహుబలి నుంచి ప్రభాస్ స్టార్ మారిపోయింది. ఈ రెబల్ స్టార్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగానే పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఆదిపురుష్ కోసం రూ. 150 కోట్లు.. సలార్ రెండు పార్టులకు కలిపి రూ. 300 వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలోనే అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న వారిలో ప్రభాస్ టాప్ ప్లేస్ అని చెప్పాలి.

    2. పవన్ కళ్యాణ్
    రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమాలకు ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నారు. ఆయన రీ ఎంట్రీ తర్వాత ఒక్కో సినిమాకు రూ. 50 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లుకు రూ. 60 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. తాను వన్ డే షూట్ కోసం రూ. 2 కోట్లు తీసుకుంటున్నట్లు ఆయనే చెప్పారు.

    3. మహేష్ బాబు
    ‘సర్కారువారి పాట’కు మహేశ్ బాబు రూ. 55 కోట్లు తీసుకున్నాడని టాక్. ప్రస్తుతం గుంటూరు కారంకు కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్నారట. ఇక రాజమౌళితో తాను చేసే తర్వాతి సినిమా కోసం రూ. 100 కోట్ల వరకు తీసుకుంటారని తెలుస్తోంది.

    4. జూనియర్ ఎన్టీఆర్
    ఆర్ఆర్ఆర్ తో విపరీతమైన ఫామ్ లోకి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఈ సినిమాకు సంబంధించి రూ. 45 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ ముట్టిందట. ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న కొరటాల శివ ‘దేవర’కు రూ. 60 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక, హృతిక్ రోషన్ తో కలిసి చేస్తు్న్న ‘వార్-2’కు రూ. 120 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్.

    5. రామ్ చరణ్
    ఆర్ఆర్ఆర్ తో ఫామ్ లోకి వచ్చిన మరో నటుడు రాం చరణ్. ఈయన కూడా రూ. 45 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళ డైరెక్టర్ శంకర్ సినిమా ‘గేమ్ ఛేంజర్’ కోసం రూ. 60 కోట్లు తీసుకుంటున్నారట. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉంది. దీని తర్వాత ఉప్పన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తారట.

    6. చిరంజీవి
    మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఆయనకు అంతగా కలిసి రాలేదు. ఖైదీ నెం. 150తో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకు తీసుకుంటున్నారట. వాల్తేరు వీరయ్యకు రూ. 40 కోట్లు తీసుకున్న చిరంజీవి భోళా శంకర్ కు రూ. 15 కోట్లు తీసుకొని చాలు అని నిర్మాతను ఇబ్బంది పడవద్దు అని చెప్పారట.

    7. అల్లు అర్జున్
    పుష్ప తో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న అల్లు అర్జున్ టాలీవులోనే కొత్త చరిత్ర రాశారు. అయితే ఆయన ప్రస్తుతం ఒక సినిమాకు రూ. 60 కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2కు కూడా రూ. 60 కోట్లు తీసుకుంటున్నారట. దీని తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. దీనికి రూ. 100 కోట్లు తీసుకుంటారని టాక్.

    8. బాలకృష్ణ
    అఖండకు సంబంధించి బాలయ్య రూ. 11 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా రూ. 90 కోట్ల షేర్ చేసినందుకు గానూ రూ.  15 కోట్ల వరకు పెంచినట్లు తెలుస్తోంది. ఇక ‘భగవంత్ కేసరి’కి రూ. 25 కోట్లుపైగానే తీసుకున్నట్టు సమాచారం

    9. నాగార్జున
    నట సామ్రాట్ నాగార్జున ఒక్కో సినిమాకు రూ. 7 కోట్లు తీసుకుంటున్నారని టాక్.. ఆ మధ్య విడుదలైన బంగార్రాజుకు రూ. 40 కోట్లు షేర్ వసూలు చేసింది. నాగార్జున రీసెంట్‌ మూవీ ‘ది ఘోస్ట్’ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు.

    10. వెంకటేష్
    విక్టరీ వెంకటేశ్ ఒక్కో సినిమాకు రూ. 7 కోట్ల వరకు పుచ్చుకుంటున్నారని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే  వెంకటేష్ ఎఫ్ 3 కోసం రూ. 15 కోట్ల వరకు తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2023 Year Roundup : ఈ ఏడాదిలో వెండితెరపై కనిపించని ఈ హీరోలు..!

    2023 Year Roundup Box Office : ఈ సంవత్సరం (2023)...

    Prakash Raj : ఆ హీరోకు క్షమాపణ చెప్పిన ప్రకాష్ రాజ్.. కారణం ఏంటంటే?

    Prakash Raj : విలక్షణ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఈయన...

    ANR Statue Inauguration : అక్కినేని నాగేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ.. మహేష్, చరణ్ హాజరు.. ఇంకా ఎవరెవరు వచ్చా

    ANR Statue Inauguration : టాలీవుడ్ లెజెండరీ నటులలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు.....