36.9 C
India
Monday, May 6, 2024
More

    Prakash Raj : ఆ హీరోకు క్షమాపణ చెప్పిన ప్రకాష్ రాజ్.. కారణం ఏంటంటే?

    Date:

    Prakash Raj :
    విలక్షణ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఈయన గురించి తెలియని సినీ ప్రేక్షకులు లేరు.. పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో ప్రకాష్ రాజ్ చేయని పాత్ర లేదు అనే చెప్పాలి.. క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి విలన్ వరకు అన్ని రోల్స్ పోషించి ప్రకాష్ రాజ్ అంటే అందరికి పరిచయమే..
    మరి అలాంటి ప్రకాష్ రాజ్ తాజాగా ఒక హీరోకు క్షమాపణలు చెప్పారు. మరి ఎందుకు ప్రకాష్ రాజ్ హీరోకు క్షమాపణలు చెప్పారు? అందుకు కారణం ఏంటి? అనేది చూద్దాం.. అసలు స్టోరీలోకి వెళ్తే.. ప్రకాష్ రాజ్ స్టార్ హీరో సిద్ధార్థ్ కు బహిరంగ క్షమాపణలు చెప్పారు. సిద్ధార్థ్ నటించిన కొత్త చిత్రం ‘చిత్త’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
     ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధార్థ్ గురువారం బెంగుళూరులో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. అయితే కన్నడ సంఘాలు ఈ సమావేశాన్ని అడ్డుకున్నాయి.. కావేరీ ఉద్యమానికి మద్దతు తెలపాలంటూ డిమాండ్ చేసారు. దీంతో విలేకరుల సమావేశం నిర్వహించకుండానే సిద్ధార్థ్ అక్కడి నుండి వెళ్లిపోయారు..
    చేతులు జోడించి, అందరికి థాంక్స్ చెప్పి సిద్దార్థ్ వెళ్ళిపోయిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన ప్రకాష్ రాజ్ స్పందించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ సమస్య ఎప్పటి నుండో ఉంది.. ఈ సమస్యను దశాబ్దాలు గడిచిన పరిష్కరించక పోవడంతో పరిష్కారం కోసం కేంద్రం వద్ద ఒత్తిడి తీసుకురాలేని ఎంపిలను ప్రశ్నించకుండా సామాన్యులను, కళాకారులను వేధించడం తప్పని అందుకు కన్నడ ప్రజల నుండి సిద్ధార్థ్ కు క్షమాపణలు చెబుతున్నట్టు ట్వీట్ చేసారు.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hero Siddharth : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్..

    Hero Siddharth : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్  వివాహం చేసుకున్నాడు....

    Top Heros Remuneration : రెమ్యునరేషన్ విషయంలో టాలీవుడ్ టాప్.. ఎవరికి ఎంతో తెలుసా?

    Top Heros Remuneration : ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు టాలీవుడ్ చలన...

    ANR Statue Inauguration : అక్కినేని నాగేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ.. మహేష్, చరణ్ హాజరు.. ఇంకా ఎవరెవరు వచ్చా

    ANR Statue Inauguration : టాలీవుడ్ లెజెండరీ నటులలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు.....