Prakash Raj : నటుడు ప్రకాష్ రాజ్ కు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసింది. ఈ వీడియోలో అతను పాలస్తీనా అంశాన్ని కశ్మీర్ అంశంతో ముడిపెట్టి మాట్లాడాడు. ఈ వీడియో ఎప్పుటిదన్నది స్పష్టంగా తెలియకున్నా.. ఇటీవల పాలస్తీనా గాజాను ఆక్రమించుకునేందుకు చేసిన యుద్ధం నేపథ్యంలో వచ్చిందని మాత్రం చెప్పవచ్చు.
రెండు ప్రాంతాల్లో మానవ హక్కువ ఉల్లంఘన లాంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. రెండు విభిన్నమైన పరిస్థితులను మేళవించి ఇలా మాట్లాడడం సరికాదని నెటిజన్లు, ఇండియన్స్ ప్రకాశ్ రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కశ్మీర్ వివాదంలో భారత, పాకిస్తాన్ మధ్య వివాదాలు ఉన్నాయి. రెండు దేశాలు ఈ ప్రాంతాన్ని తమ పరిధిలోనివి అంటే పరిధిలోనిది అంటూ చెప్తున్నాయి. అసలు కశ్మీర్ పూర్తిగా భారత్ కు చెందింది. పాకిస్తాన్ కు చెందింది కాదు. కానీ భారత్ లో అస్థిరతను సృష్టించేందుకు పాకిస్తాన్ దీన్ని పావుగా వాడుకుంది. అక్కడి వారిని అన్ని రంగాల్లో నాశనం చేస్తూ దేశానికి తలగా ఉన్న కశ్మీర్ లో ఎప్పుడూ గొడవలు, అల్లర్లను సృష్టిస్తూ భారత్ కు ప్రశాంతత లేకుండా చేయాలనుకుంది. 370 ఆర్టికల్ ఎత్తేశాక.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
అయితే పాలస్తీనా, ఇజ్రాయెల్ పరిస్థితి అలా కాదు. ఇజ్రాయెన్లకు, పాలస్తీనియన్లు అనేక దశాబ్దాల పోరాటం జరిగింది. ఒక దశలో పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ లను వెళ్లగొడితే భారత్ లో తల దాచుకున్నారు. ఆ తర్వాత 1948లో ఇజ్రాయన్లు తమ భూమిని తాము ఆక్రమించుకున్నారు.
పాలస్తీనా, కశ్మీర్ రెండు సమస్యలకు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉంది. సోకాల్డ్ మేథావిగా చెప్పుకుంటున్న ఆయన కనీస విషయాలు తెలుసుకొని మాట్లాడాలని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భారత్ ఇజ్రాయెల్ కు సపోర్టుగా ఉంటుంది కాబట్టి మనం పాలస్తీనాకు సపోర్ట్ గా ఉండాలని అనుకుంటున్నావా? ప్రకాశ్ రాజ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాళ్లు లేకపోలేదు.
ఇజ్రాయెల్ భారత్ ను రెండో జన్మభూమిగా చూస్తుంది. కానీ పాలస్తీనా మాత్రం శత్రువుగా చూస్తుంది. ఇది కూడా తెలియాదా? కుహనా మేథావి అంటూ ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు. ఏదో మాట్లాడితే సోషల్ మీడియాలో వైరల్ గా మారచ్చు అనుకునే ఇలాంటి వారికి తెలివి లేదా? అంటూ ప్రశ్నించే వారు లేకపోలేదు.
Prakash Raj compares Palestine with Kashmir- Says give them their land pic.twitter.com/d28WIaf0pC
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 18, 2024