36.7 C
India
Thursday, May 16, 2024
More

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Date:

    Dubai
    Dubai

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు రాజధాని నగరమది. ప్రపంచంలోనే అత్యంత అధునాతన నగరం. దుబాయ్ సిటీకి షాపింగ్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు వివిధ కార్యకలాపాలకు లక్షలాది మంది వివిధ దేశాల నుంచి ఇక్కడి వస్తుంటారు. ఇప్పటికే దుబాయ్ విమానాశ్రయం చాలా రిచ్ గా, పెద్దగా ఉంటుంది. అయితే భవిష్యత్ లో దుబాయ్ కు మరింత ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది.

    ప్రయాణికుల సౌకర్యార్థం దుబాయ్‌లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద విమానాశ్ర‌యం నిర్మించనున్నారు. ఈ మేర‌కు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం ఎక్స్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఎయిర్‌పోర్టును అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిల‌వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 34.85 బిలియన్ డాల‌ర్లు వెచ్చిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అంటే భార‌తీయ క‌రెన్సీలో రూ. 2.9ల‌క్ష‌ల కోట్లు అన్న‌మాట‌. ప‌దేళ్ల‌లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని దుబాయ్ అధికారులు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

    ఏడాదికి 260 మిలియన్ల మంది రాక‌పోక‌లు కొన‌సాగించేలా ఈ విమానాశ్ర‌యాన్ని నిర్మిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇక అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్ర‌స్తుత‌ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కంటే ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి అన్ని కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ చేయడం జ‌రుగుతుంద‌న్నారు.

    400 టెర్మినల్ గేట్లు, ఐదు స‌మాంత‌ర‌ రన్‌వేలు ఈ విమానాశ్రయం సొంతం. ఈ ఎయిర్‌పోర్టు ఫ్లాగ్‌షిప్ క్యారియర్ ఎమిరేట్స్, లోబడ్జెట్‌ విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్‌తో పాటు ప్రపంచాన్ని దుబాయ్‌కి, బయటికి కనెక్ట్ చేసే అన్ని ఎయిర్‌లైన్ భాగస్వాములకు కొత్త డెస్టినేష‌న్‌ కానుందని దుబాయ్ ప్రభుత్వ ఎయిర్‌లైన్ ఎమిరేట్స్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్-మక్తూమ్ వెల్ల‌డించారు. ఈ నిర్మాణం ‘‘ప్రపంచ వేదికపై ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా దుబాయ్ స్థానాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది’’ అని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ దుబాయ్ మీడియాతో చెప్పారు.

    ‘‘అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది రాక‌పోక‌లు కొన‌సాగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఏడాదికి దాదాపు 260 మిలియన్ల మంది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్ర‌యాణాలు కొన‌సాగించ‌వ‌చ్చు. ఇది ప్రస్తుత దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కంటే ఐదు రెట్లు అధికం. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాలు రాబోయే సంవత్సరాల్లో దీనికి బదిలీ అవుతాయి. విమానాశ్రయం 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్‌లు, ఐదు సమాంతర రన్‌వేలను కలిగి ఉంటుంది. ఏవియేషన్ రంగంలో తొలిసారిగా కొత్త ఏవియేషన్ టెక్నాలజీలు ఉపయోగించబడతాయి’’ అని అల్ మక్తూమ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Faria Abdullah : దుబాయ్ లో ఫరియా అబ్ధుల్లా.. ఏం చేస్తుందో తెలుసా?

    Faria Abdullah :113H, 10Y ప్రకారం ‘ఇచ్చేయండి సార్ పాపం బెయిల్...

    UAE: యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

                    UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  యూఏఈలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు...

    World’s Largest Airport : ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఎక్కడుందో తెలుసా?

    World's Largest Airport : ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం సౌదీ అరేబియాలో...

    Rakhi Sawant: కష్టాల్లో రాఖీ సావంత్.. న్యూడ్ వీడియోలు రూ. 50 లక్షలు

    Rakhi Sawant: రాఖీ సావంత్ కు కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి....