33.6 C
India
Monday, May 20, 2024
More

    World’s Largest Airport : ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఎక్కడుందో తెలుసా?

    Date:

    World's Largest Airport
    World’s Largest Airport

    World’s Largest Airport : ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం సౌదీ అరేబియాలో ఉంది. రమ్మమ్ నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీని విస్తీర్ణం 483 చదరపు కిలోమీటర్లు. ప్యారిస్ నగరానికి ఎనిమిది రెట్లు ఉంటుంది. ఇక్కడ నుంచి 37 విమానయాన సంస్థలు విమానాలు నడుపుతుంటాయి. దాదాపు 43 ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తుంటాయి.

    విమానాశ్రయం పెద్దదైనా ప్రయాణికులు మాత్రం కోటి మంది వరకు ఉంటారు. దీని కంటే చిన్న విమానాశ్రయమైన లండన్ లోని హిత్రూ విమానాశ్రయం సంవత్సరానికి 8 కోట్ల మందిని చేరవేస్తుంది. సౌదీ అరేబియా రాజు ఫాహద్ తన పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం 1999 నవంబర్ 28 నుంచి ప్రయాణికులకు సేవలందిస్తోంది.

    గల్ఫ్ యుద్ధం సమయంలో ఇది అమెరికన్ వైమానిక దళాలకు స్థావరంగా పనిచేసింది. ఇందులోని పార్కింగ్ స్పేస్ లో ఐదువేల కార్లు నిలిపి ఉంచడానికి అనుకూలంగా ఉంటుంది. విస్తీర్ణంలో పెద్దగా ఉన్నా ప్రయాణికుల చేరవేతలో చిన్నదే కావడం గమనార్హం. ఇలా ప్రపంచంలో పెద్దగా గుర్తింపు తెచ్చుకున్నా మిగతా విషయాల్లో అన్నింటికంటే చిన్నదే అని తెలుస్తోంది.

    సముద్రంలో ఎన్ని నీళ్లున్నా దాహం తీరనట్లే. ఈ విమానాశ్రయం విస్తీర్ణంలో పెద్దగా ఉన్నా ప్రయాణికుల విషయంలో అంత గొప్ప పేరు లేదు. దీని కంటే చిన్న విమానాశ్రయాలు ఎంతో మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ఇది మాత్రం పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను పంపిస్తోంది. దీనికి అన్ని విమానాశ్రయాలతో అనుసంధానం లేనట్లే.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    Paris : సినీ ఫక్కీలో దోపిడీ.. పట్టపగలు రూ.180 కోట్ల సొత్తు చోరీ

    Paris  ఫ్రాన్స్ లోని పారిస్ లో భారీ చోరీ జరిగింది. బంగారు,...