31 C
India
Thursday, May 16, 2024
More

    Waltair Veerayya: వాల్తేరు వీరయ్య’లో ప్రకాశ్ రాజ్ పాత్రను వదులుకున్న నటుడు.. ఎవరో తెలుసా?

    Date:

    Waltair Veerayya:

    దర్వకుడు బాబీ-మెగస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. వింటేజ్ లుక్ తో చిరంజీవి ఇటు మాస్, అంటు క్లాస్ ఆడియన్స్ ను తన వైపునకు తిప్పుకున్నాడు. చిరంజీవి కామెడీ టైమింగ్ అంటే సాధారణ సినీ అభిమానికి కూడా చాలా ఇష్టమనే చెప్పాలి. ఆయన కామెడీ టైమింగ్ తో జనాలను బాగా ఆకర్షించాడు. ఇక చిరంజీవికి తమ్ముడిగా మాస్ మహరాజ్ రవితేజ నటించిన సంగతి తెలిసిందే.
    ఇక, ప్రకాశ్ రాజ్ గురించి మాట్లాడితే ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో మెప్పించాడు. విలక్షణ నటుడు అయిన ప్రకాశ్ రాజ్ కు ఏ పాత్ర అయినా ఇట్టే నప్పుతుంది. కానీ దర్శకుడు బాబీ ఈ మూవీలో ప్రకాశ్ రాజ్ పాత్ర కోసం మరో నటుడిని అనుకున్నారట. కానీ ఆయనకు వరుస సినిమాలు ఉండడం, డేట్స్ లేకపోవడంతో ప్రకాశ్ రాజ్ ను తీసుకోవాల్సి వచ్చిందట. ఇందులో విలన్ పాత్రలో తీసుకోవాల్సిన నటుడు ఎవరో కాదు డైరెక్టర్ సముద్రఖని. అలవైకుంఠ పురము లాంటి సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే దుమ్ము దులిపేసే వాడని తెలుస్తోంది.

    సముద్రఖని ఒక్క రంగమే కాదు చాలా రంగాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దర్శకుడిగా సముద్ర ఖని బ్లాక్ బస్టర్ చిత్రాలను తీశారు. తమిళంలో ఆయన తీసిన చిత్రాలు జనాధరణ పొందాయి. రీసెంట్ గా ఆయన తీసిన ‘బ్రో: ది అవతార్’ బిగ్ హిట్ దక్కించుకుంది. ఇక ఇదే సినిమాను తమిళంలో వినోదయ సీతంను కూడా ఆయనే తెరకెక్కించారు. ఈ చిత్రంకు ముందు ఆయన విమానం సినిమాలో నటుడిగా కనిపించారు. తండ్రి పాత్రలో ఆయన నటించిన తీరు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఆయనకు డేట్స్ సరిగా లేక దర్శకుడిగా.. నటుడిగా కొన్ని చిత్రాల్లో బిజీగా ఉండడంతో ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నారట బాబీ.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prakash Raj : ఆ హీరోకు క్షమాపణ చెప్పిన ప్రకాష్ రాజ్.. కారణం ఏంటంటే?

    Prakash Raj : విలక్షణ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఈయన...

    chiranjeevi fans : చిరంజీవి ఫ్యాన్స్ కు పండగే..

    chiranjeevi fans ఓ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగు ఏంటంటే నరికినా...

    Bro : బ్రో ది అవతార్ ప్రమోషన్ కు పవన్ కళ్యాణ్ దూరం..!

    Bro పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆనందం, విషాదం రెండు ఒకేసారి...